రోజుకి మూడు పూట‌లా తిండి దొరికితే చాలు అనుకునే స్థాయి నుంచి ప‌న్నెండు వేల కోట్ల స్థాయికి విస్త‌రింప‌చేసే వ్యాపారాన్ని చేసే స్థాయికి ఎదిగిన వ్య‌క్తి కిర‌ణ్‌కుమార్‌. ఇక ఈ పేరు ఎవ్వ‌రికీ పెద్ద‌గా తెలియ‌క‌పోవ‌చ్చు కాని ల‌లితాజువ‌ల‌రీ ఎం.డి. డ‌బ్బులు ఎవ్వ‌రికీ ఊరికే రావండి అని టీవీల్లో క‌నిపించే ఓ పెద్ద మ‌నిషిగా కిర‌ణ్ అంద‌రికి సుప‌రిచితుడే. చిన్న‌ప్పుడు బంగార షాపుల్లో కూలిగా ప‌నిచేసిన కిర‌ణ్ ఇప్పుడు ఆ రంగంలోనే వ్యాపార‌వేత్త‌గా మారారు. కిర‌ణ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని నెల్లూరు జిల్లాలో ఓ రాజ‌స్థాని కుటుంబంలో జ‌న్మించారు. 80ఏళ్ళ క్రింద‌టే వారి కుటుంబం రాజ‌స్థాన్ నుంచి నెల్లూరు వ‌చ్చి స్థిర‌ప‌డింది. ఎనిమిది మంది సంతానంలో చివ‌రివాడు కిరణ్‌. కిర‌ణ్‌తండ్రి బంగారు దుకాణాల్లో బ‌ట్ట‌ల దుకాణాల్లో ప‌నిచేసేవారు. అయినా స‌రే రోజుకి ఒక్క‌పూట తిండి దొర‌క‌డం చాలా క‌ష్టంగా ఉండేది. ఎలాగోలా ఐద‌వ త‌ర‌గ‌తి వ‌ర‌కు చ‌దివి ఆ త‌ర్వాత ఆయ‌న చ‌దువు మానేశారు. తొమ్మిదేళ్ళ‌కే జీవితం పై స్ప‌ష్ట‌త ఏర్ప‌రుచుకున్నారు కిర‌ణ్‌. చిన్న‌ప్పుడు త‌న వ‌య‌సులో ఉన్న పిల్ల‌ల‌తో క‌లిసి బంగారుషాపులో ప‌నిచేయ‌డానికి వెళ్ళేవాడు. అలా మూడేళ్ళు ప‌ని చేసిన త‌ర్వాత నెల్లూరులో త‌యారు చేస్తున్న న‌గ‌ల్ని చెన్నై కేర‌ళ‌లో కొన్ని దుకాణాల‌కి హోల్‌సేల్‌గా అమ్ముతార‌ని తెలుసుకున్నాడు.

 

తాను కూడా అలానే న‌గ‌లు త‌యారు చేసి అమ్మి డ‌బ్బు సంపాదించాల‌ని భావించారు. అనుకున్న‌దే త‌డ‌వుగా ఇంట్లో అమ్మ భ‌ద్రంగా దాచుకున్న నాలుగు బంగారు గాజుల‌ని ఇంట్లో వాళ్ళ‌కి చెప్ప‌కుండా తీసుకువెళ్ళి క‌రిగించి 65 గ్రాముల్లో కొన్ని ఝుంజీలు చేయించారు. ఆ త‌ర్వాత ఆ న‌గ‌ల‌ను తీసుకుని చెన్నై వెళ్ళి త‌ను గ‌తంలో వెళ్ళిన ల‌లిత జువెల‌రీ ద‌గ్గ‌ర నిల్లున్నారు. ఆ ఓన‌ర్ రాగానే ఆయ‌న వ‌ద్ద‌కు వెళ్ళి నా కొచ్చిన న‌గ‌ల‌ను అమ్మ‌డానికి నెల్లూరు నుంచి వ‌చ్చాను అని చెప్పారు. ఇక ఈ విష‌యం తెలుసుకున్న ఇంట్లో వాళ్ళు తిట్ట‌డం మొద‌లు పెట్టారు. అయితే వాళ్ళ‌నాన్న బాగా తిడుతుంటే. అమ్మ‌మాత్రం ఏమీ అన‌లేదు. ఇంట్లో మిగిలిన చివ‌రి న‌గ‌లు ఇవే నువ్వే ఆలోచించుకో అన్నారు.

 

ఆ మాటే కిర‌ణ్ జీవితంలో కీల‌క మ‌లుపుగా మారింది. ఆ త‌ర్వాత రోజూ కిర‌ణ్ ల‌లిత‌జువెల‌రీకి వెళ్ళ‌డం అత‌న్ని చూడ‌గానే కంద‌స్వామి ఆ షాప్ ఓన‌ర్ మ‌రిన్ని ఇలాంటివి చేసుకురా అని చెప్ప‌డం అందుకు ఆయ‌న‌కు ప‌దిహేనువేలు డ‌బ్బులు ఇవ్వ‌డం జ‌రిగింది. కిర‌ణ్ వ్యాపారంలో తొలి సంపాద‌న‌గా మొద‌ల‌యింది. ఆ ప‌దిహేను వేల‌తో త‌న సంపాద‌న మీద త‌న‌కు న‌మ్మ‌కం క‌లిగింది. అలా చిన్న‌చిన్న‌గా త‌యారు చేసుకుంటూ వెళ్ళ‌గా నెమ్మ‌దిగా ల‌లితా వాళ్ళు త‌న ద‌గ్గ‌రే బంగారం కొన‌డం మొద‌లుపెట్టారు. ఇలావాళ్ళ అమ్మ‌గాజుల‌తో కిర‌ణ్ త‌న మొద‌టి అడుగుని మొద‌లుపెట్టాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: