హ్యాపీ డేస్ సినిమాలో  క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన నిఖిల్ ఆ తర్వాత ఏకంగా హీరోగా అవతారమెత్తాడు. ఇక ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలు దక్కించుకుని యువ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నిఖిల్. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకుల్లో నిఖిల్ తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్నారు. దీంతో నిఖిల్ సినిమా వస్తుందంటే అందులో ఏదో ప్రత్యేకత ఉంటుంది అనుకుంటారూ  అభిమానులు . ఇక ఏది పడితే అది చేయకుండా కథల ఎంపిక విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నాడు నీఖిల్. ఇప్పటికే మంచి విజయాలను కూడా తన ఖాతాలో వేసుకున్నారు. అయితే మొన్నటికి మొన్న నీఖిల్  ఎంగేజ్మెంట్ కూడా జరిగిన విషయం తెలిసిందే. 


 ఇంకొన్ని రోజుల్లో నిఖిల్ ఓ  ఇంటివాడు కాబోతున్నాడు. అయితే నిఖిల్ కెరీర్ ను  గాడిలో పడేలా చేసిన సినిమా కార్తికేయ. సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కిన కార్తికేయ సినిమా మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. దర్శక నిర్మాతలు అందరిచూపు నిఖిల్ పై  పడేలా చేసింది ఈ సినిమా. హీరో నిఖిల్ దర్శకుడు చందు మొండేటి కాంబినేషన్ లో  ఈ సినిమా వచ్చి  మంచి విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో నిఖిల్ కార్తికేయ సినిమాకి సీక్వెల్ చేయడానికి సిద్ధమై పోయాడు. అటు దర్శకుడు చందు మొండేటి కూడా కార్తికేయ 2  కోసం స్క్రిప్ట్ కూడా రెడీ చేశాడు. అయితే కార్తికేయ సినిమా లో కలర్స్ స్వాతి నిఖిల్  కు జోడిగా కనిపించిన విషయం తెలిసిందే. 

 


 ప్రస్తుతం కలర్స్ స్వాతికి పెళ్లి జరిగిన నేపథ్యంలో కార్తికేయ2 సినిమాలో  కలర్స్ స్వాతి కనిపిస్తుందా లేదా అనే విషయంపై కూడా ఆసక్తి నెలకొంది. అయితే గతంలో కార్తికేయ సినిమాలో కలర్స్ స్వాతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన విషయం తెలిసిందే.కాగా  తాజాగా దీనిపై హీరో నిఖిల్ క్లారిటీ ఇచ్చారు. కార్తికేయ సినిమాలో కలర్స్ స్వాతి పాత్ర కొనసాగింపు ఉంది అంటూ తెలిపాడు. ఆ పాత్ర లో కలర్స్ స్వాతి నటిస్తూందని అంటూ నిఖిల్ స్పష్టం చేశారు. స్వాతి తో పాటు ఈ సినిమాలో మరో హీరోయిన్  కూడా ఉండబోతుంది అంటూ తెలిపిన నిఖిల్... ఆమె ఎంపిక చేసే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. మరి ఆ అవకాశం ఎవరికి వరిస్తుంది అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమా దసరాకు విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట చిత్రబృందం.

మరింత సమాచారం తెలుసుకోండి: