కడప జిల్లాలో టీడీపీ నేతలు రోడ్ల మీద దౌర్జన్యానికి దిగుతున్నారు. కడపలో పోటీ చేసినా టీడీపీ గెలిచే పరిస్థితి లేకపోవడంతో అధికారులపై, పోలీసులపై దుర్భాషలాడుతూ రెచ్చిపోతున్నారు. అనంతరం వైసీపీ నాయకులు దౌర్జన్యానికి దిగుతున్నారంటూ ప్రచారం చేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి కడపలో అరగంట పాటు వీరంగం సృష్టించారు. రాయడానికి వీలు కాని అసభ్యకర పదజాలంతో పోలీసులపై దుర్భాషలాడారు. 
 
నడిరోడ్డుపై హల్ చల్ చేసి ట్రాఫిక్ సమస్యలు ఏర్పడటానికి కారణమయ్యారు. అందరి సంగతి తేలుస్తానంటూ హెచ్చరికలు జారీ చేశారు. జనం మద్దతు కోల్పోయిన టీడీపీ నేతలు పోటీ చేసినా ఓడిపోతామని తెలిసి జిల్లాలో దౌర్జన్యాలకు దిగుతున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తొండూరు మండలానికి చెందిన అరుణమ్మ తనను వైసీపీ నేతలు నామినేషన్ వేయనివ్వలేదని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ దగ్గర నడిరోడ్డుపై బైఠాయించింది. 
 
టీడీపీ ఇంఛార్జీ బీటెక్ రవి అక్కడికి చేరుకుని పోలీసుల సంగతి తేలుస్తానంటూ హెచ్చరించారు. కొద్దిసేపు అక్కడ హల్ చల్ చేసిన బీటెక్ రవి అక్కడినుండి వెళ్లిపోయారు. పోలీసులను బీటెక్ రవి బూతులు తిట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు రైల్వే కోడూరులో నామినేషన్ వేయడానికి వచ్చిన వైసీపీ కార్యకర్త నాగేశ్వరయ్యపై టీడీపీ దాడికి దిగింది. మైదుకూరు మండలం తిప్పారెడ్డిపల్లిలో టీడీపీ మద్దతుదారులు వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థిపై దాడికి దిగారు. 
 
దాడిలో వరప్రసాద్ కు తీవ్ర గాయాలు కాగా అతడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రజల మద్దతుతో టీడీపీ గెలిచే అవకాశాలు లేకపోవడంతో దాడులకు పాల్పడుతున్నారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు టీడీపీ వైసీపీ నాయకులే తమపై దాడులకు దిగుతున్నారంటూ ఆరోపణలు చేసింది. చిన్నమండెం మండలం టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి నాగరత్నమ్మను వైసీపీ నాయకులు అడ్డుకొని నామినేషన్ పత్రాలు అపహరించగా పోలీసులు దగ్గరుండి నామినేషన్ వేయించారని సమాచారం.                     

మరింత సమాచారం తెలుసుకోండి: