మనిషికి ప్రాణం అంటే ఎంత తీపో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  తనకు ప్రాణ హానీ ఉందీ అన్న విషయం తెలిస్తే దాని జోలికి వెళ్లరు.. తాజాగా ఇప్పుడు ప్రపంచం మొత్తం కరోనా భయం పట్టుకున్న విషయం తెలిసిందే.  అయితే ఈ కరోనా వైరస్ ఇప్పుడు భారత దేశంలో కూడా విస్తరిస్తుంది.  రోజురోజుకు అన్ని దేశాలలో కరోనా వైరస్ భాదితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. భారత్‌లో కూడా దాదాపు 70 కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ అంటువ్యాధి కాదని చెబుతూ ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తుంది. ఒక్కసారి మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా ఫాలో అవుతారన్న విషయం తెలిసిందే. 

 

కరోనా ఎఫెక్ట్ వల్ల చికెన్, మటన్ ఇతర మాంసం తినాలంటే జనాలు భయపడిపోతున్నారు.  దాంతో చికెన్, మటన్ అమ్మకాలు చాలా వరకు తగ్గాయి. అయితే మంసాహారులు మాత్రం చికెన్, మటన్ కి దూరం కాలేక.. దానికి ప్రత్యామ్నాయం ఏంటా అని తెగ బాధపడిపోతున్నారు.  ఈ నేపథ్యంలో ఇప్పుడు జాక్ ఫ్రూట్(పనస) తినడం మంచిదని చెబుతున్నారు. ఇంకేముంది ఇప్పుడు ఈ పండుకు విపరీతమైన గిరాకీ పెరిగిపోయింది. సాధారణంగా పనస పండుకు కిలో రూ. 50 ఉండేది, కానీ ఇప్పడు ఒక్కసారిగా అమాంతం కిలో రూ. 120కి చేరింది.  విచిత్రం ఏంటంటే చికెన్ ధర కిలో రూ. 50 లోపే ఉంది.

 

కొన్ని చోట్ల దారుణంగా వంద రూపాయలకు మూడు కిలోలు కూడా అమ్ముతున్నారు.  కరోనా దెబ్బకు నాన్ వెజ్‌కు దూరంగా ఉంటున్న ప్రజలు.. పనస పండుతో చికెన్,  మటన్ బిర్యానీలు తయారుచేస్తున్నారు.  చికెన్, మటన్ బిర్యానీల బదులు కాథల్ (పనస) బిర్యానీ చేసుకొని తింటే బెటర్ అని అంటున్నారు.  దాంతో యూట్యూబ్ లో జాక్ ఫ్రూట్ తో బిర్యాని ఎలా తయారు చేస్తారని మహిళామణులు వీడియోలు చూడటం మొదలు పెట్టినట్లు సమాచారం.  అయితే పనస పండు తినడం వల్ల   చర్మాన్ని ముడతలు పడుకుండా అడ్డుకుంటుంది. కంటి చూపును పెంచడంతోపాటు.. మంచి జుట్టును కూడా ఇస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: