ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చేర్పులు అవుతున్నాయి.  మొన్నటి వరకు టీడీపీకి జై కొట్టిన వారు ఇప్పుడు వైసీపీకి జై కొడుతున్నారు.  త్వరలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ చెంతకు చేరుతున్నారు ఇతర పార్టీ నేతలు.  ఈ క్రమంలో టీడీపీకి చెందిన సీనియర్, జూనియర్ నాయకులు వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు.  ఇటీవల జనసేన పార్టీకి రాజీనామా చేసిన వెంకట్రామయ్య. వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు.  ఇప్పటికే రావెల కిషోర్‌బాబు, చింతల పార్థసారథి, మారంశెట్టి రాఘవయ్య, అద్దేపల్లి శ్రీధర్‌, డేవిడ్ రాజు తదితరులు జనసేనను వీడిన విషయం తెలిసిందే. తాజాగా  మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి నిన్న సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. 

 

ఈ నేపథ్యంలో ఆయన పార్టీ వీడిపోవడానికి గల కారణం మీడియాకు వివరించారు.  చంద్రబాబు పార్టీలో ఉండలేని పరిస్థితులు కల్పించారని, తానే కాకుండా అనేకమంది నేతలు పార్టీని వీడడానికి కారణం ఇదేనని అన్నారు.  ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా ఆయన పదవిలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఎంతో అభివృద్ది చెందుతుందని ఎంతగానో భావించామని.. కానీ దానికి పూర్తి విరుద్దంగా ఆయన తన సొంత వారికే పరిమితం అయ్యారని అన్నారు. పార్టీ విడిపోయానని ఆయనపై దురుద్దేశపూర్వకంగా ఏమీ చెప్పడం లేదని.. ఏపిలో చాలా మంది తెలుగు దేశం సీనియర్ నేతల్లో ఉన్న అభిప్రాయమే అని అంతే కానీ.. తనపై వైసీపీ ఒత్తిళ్లు, బెదిరింపులు లేవని స్పష్టం చేశారు.

 

కార్యకర్తలు కూడా వైసీపీలో చేరాలంటూ ప్రోత్సహించారని రామసుబ్బారెడ్డి వెల్లడించారు. సీఎం జగన్ పరిపాలన తనను బాగా ఆకట్టుకుందని తెలిపారు. ప్రజల్లోకి వెళ్లి ఆయన వారి కష్టాలు స్వయంగా తెలుసుకున్న తర్వాత సీఎం పవిలోకి వచ్చిన తర్వాత జనరంజకంగా పాలన సాగిస్తున్నారు.  ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ది పథంలో నడిపిస్తారని ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: