ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైసీపీ ఎక్కువ స్థానాల్లో ఏకపక్ష విజయాలు అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి స్థానాల్లో అధికార వైసీపీ అన్నిచోట్ల నామినేషన్స్ వేస్తే, ప్రతిపక్షాలు కొన్ని స్థానాలకే పరిమితమైపోయాయి. దీంతో వైసీపీకి ఏకగ్రీవాలు ఎక్కువ రానున్నాయి. అలాగే ఎన్నికల జరిగే వాటిల్లో కూడా మెజారిటీ సీట్లు వైసీపీ ఖాతాలోనే పడే అవకాశాలున్నాయి.

 

అయితే వైసీపీకి అసెంబ్లీ ఎన్నికల్లో 175 సీట్లకు గాను 151 సీట్లు వచ్చాయి..కాబట్టి ఆయా నియోజకవర్గాల్లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ 80 శాతంపైగా స్థానాలు కైవసం చేసుకునే ఛాన్స్ ఉంది. అలా వైసీపీ మెజారిటీ స్థానాలు గెలుచుకునే నియోజకవర్గాల్లో గుంటూరు జిల్లాలోని బాపట్ల, వేమూరులు కూడా తప్పకుండా ఉంటాయి. ఈ రెండు చోట్ల అధిక స్థానాలు వైసీపీకి దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.

 

ముఖ్యంగా బాపట్లలో వైసీపీ వన్‌సైడ్ విక్టరీ కొట్టేలా ఉంది. ఎందుకంటే ఇక్కడ వైసీపీకి తిరుగులేని ఆధిక్యం ఉంది. గత రెండు పర్యాయాలు నుంచి వైసీపీ తరుపున కోన రఘుపతి అద్భుత విజయాలు సాధిస్తున్నారు. మృదుస్వభావిగా ఉన్న ఆయన నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి ముందుంటారు. అందుకే వరుసగా గెలుస్తున్నారు. అయితే ఇక్కడ టీడీపీ గత నాలుగు పర్యాయాల నుంచి విజయానికి దూరమవుతూ వస్తోంది. చివరిగా ఇక్కడ 1999 ఎన్నికల్లోనే గెలిచింది.

 

ఇక 2019 ఎన్నికల్లో ఓడిపోయిన అన్నం సతీశ్ బీజేపీలోకి వెళ్లడంతో, ఇప్పుడు వెగ్నేశ నరేంద్ర వర్మ ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. ఈయనకు కోనకు పోటీ ఇచ్చేంత సత్తాలేదు. కాబట్టి నియోజకవర్గంలోని బాపట్ల రూరల్, పిట్టలవానిపాలెం, కర్లపాలెం మండలాల్లో వైసీపీనే మెజారిటీ స్థానాలు దక్కించుకొనుంది. అటు వేమూరు నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే మేరుగు నాగార్జున ఉన్నారు. వేమూరు, కొల్లూరు, టి సుండూర్, భట్టిప్రోలు, అమృతలూరు మండలాల్లో వైసీపీని గెలిపించేందుకు తెగ కష్టపడుతున్నారు. ఇక్కడ కూడా వైసీపీకే మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశముంది.

మరింత సమాచారం తెలుసుకోండి: