గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో అత్యంత కీలకమైన నియోజకవర్గం గురజాల. ఈ నియోజకవర్గంలో ఒకప్పుడు కాంగ్రెస్-టీడీపీల మధ్య ఓ యుద్ధ వాతావరణమే నడిచేది. ఇక ఇప్పుడు వైసీపీ వచ్చాక ఈ పోరు మరింత పెరిగింది. ఈ రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతగా వైరం నడుస్తోంది. ఈ నియోజకవర్గంలో టీడీపీని సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావు నడిపిస్తున్నారు. ఈయన మూడు సార్లు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే నాలుగోసారి గెలుపుని వైసీపీ యువ నేత కాసు మహేశ్ రెడ్డి అడ్డుకున్నారు.

 

సీనియర్ నేత కాసు కృష్ణారెడ్డి వారసుడుగా రంగంలోకి దిగిన మహేశ్ 2019 ఎన్నికల్లో యరపతినేనికి చెక్ పెట్టి విజయం సాధించారు. ఇక మహేశ్ గెలిచిన దగ్గర నుంచి నియోజకవర్గంపై పూర్తి పట్టు తెచ్చుకున్నారు. అటు ఓడిన దగ్గర నుంచి యరపతినేని ఇమేజ్ తగ్గుతూ వచ్చింది. ఆయనపై ఇసుక మాఫియాతో పాటు పలు రకాల అవినీతి ఆరోపణలు రావడంతో టీడీపీకి డ్యామేజ్ అయింది.

 

ఇదే అదే అంశం మహేశ్ రెడ్డికి కలిసొచ్చింది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రావడంతో మళ్ళీ యరపతినేనికి బొమ్మ చూపించాలని కాసు ఫిక్స్ అయ్యారు. ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి స్థానాల్లో మెజారిటీ వైసీపీ అభ్యర్ధులని గెలిపించుకుని సత్తా చాటాలని చూస్తున్నారు. అటు యరపతినేని కూడా బాగానే కష్టపడుతున్నారు. కాకపోతే గెలుపు ఏ మేరకు వస్తుందనేది చెప్పలేని పరిస్తితి ఉంది. పైగా కొన్ని చోట్ల టీడీపీ అభ్యర్ధులు నామినేషన్లే వేయలేకపోయారు.

 

దీని బట్టి చూసుకుంటే గురజాలలో వైసీపీ హవా ఏ మేర ఉందో అర్ధం చేసుకోవచ్చు. కాసు మహేశ్ రెడ్డి బలంగా ఉండటం వల్ల వైసీపీకి అడ్వాంటేజ్ కానుంది. అలాగే సీనియర్ నేత, వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి సపోర్ట్ కూడా కాసుకే ఉంది. జంగా ఇదే నియోజకవర్గం ఉంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో ఆయనకు కూడా ఇక్కడ గట్టి పట్టుంది. దీంతో గురజాలలో వైసీపీ సూపర్ విక్టరీ కొట్టే ఛాన్స్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: