జీవితం ఒక పయనం, జనన మరణముల సంగమం.. మనిషిగా పుడుతాము.. కానీ మనిషిగా మాత్రం మరణించడం లేదు.. పొద్దున లేచిన దగ్గరి నుండి.. అబద్దాలు, ఆసూయ, ద్వేషం ఇవే నిత్యం మన అనువణువున నిండుకున్న జీవన సత్యాలు.. ఒకడు బాగుపడితే ఓర్వం, తోటి వారు బాధపడితే ఆనందిస్తాం.. ఇక మనిషికి మనిషిగా సహయం చేసే గుణాన్ని ఎప్పుడో వదిలేసాం.. ఒకవేళ చేసిన పదిమందికి చాటి చెబుతాం..

 

 

దీన్ని బట్టి తెలుస్తుంది.. మనిషిగా రోజురోజుకు ఎంతలా దిగజారిపోతున్నామో.. మరి చిన్న సహాయనికే ఇంతలా ఫీలవుతుంటే.. కరోనా అనే వ్యాధి వచ్చిన రోగులకు సేవ చేసేవారికి ఎంత గుర్తింపును ఇవ్వాలి.. ఇంత భయంకరమైన వ్యాధిపట్ల ఏమాత్రం ఎమరుపాటుగా ఉన్న సేవమాట అటుంచితే, సేవచేసే వారి ప్రాణాలకు గ్యారంటీ ఉండదు.. ఇక ఇలాంటి వారిలో డాక్టర్స్, నర్సులు ఎదుర్కునే మానసిక ఒత్తిడి అంతాఇంతా కాదు.. సరిహద్దు వద్ద సైనికులు ఎంత ముఖ్యమో, ఇప్పుడు కరోనాను ఎదుర్కోవాలంటే వైద్యసిబ్బంది అంత అవసరంగా మారారు..

 

 

అయితే ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో తమ బాధ్యతలను నిర్వహిస్తున్న నర్సుల, డాక్టర్లు ఇతర వైద్య సిబ్బంది పరిస్థితి ఎమిటి? దీని గురించి ఎప్పుడైనా ఆలోచించారా?.. లేదండి మా పనులు మాకే సరిపోతున్నాయి.. ఇలాంటి వాటి గురించి ఆలోచించే సమయం లేదంటారా.. అంటారు ఎందుకంటే సమస్య మీ ఇంటి గడప తొక్కలేదు కదా.. ఇదిలా ఉంటే కరోనా రోగులకు సేవ చేస్తున్న ఓ నర్సు పరిస్థితి తెలిస్తే గుండె బరువెక్కక మానదు.. కరోనా బాధితులకు సేవ చేయడం ఎంత ఒత్తిడితో కూడుకున్నదో ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది.

 

 

ఆ నర్సు పేరు అలేసియా బొనారీ.. ఆమె అనుభవించే నరకాన్ని ఆమె మాటల్లో వింటే.. ఒంట్లో వణుకు వస్తుంది.. అదేమంటే ఎప్పుడు మాస్కు జారిపోతుందేమోనని భయం. నేను ధరించిన కళ్లద్దాలు నా కళ్లను సరిగా కవర్ చేయట్లేదేమోనని భయం. గ్లోవ్స్ వెసుకున్న చేతులతో నన్ను నేను అజాగ్రత్తా తాకిన ఈ వైరస్ బారిన పడ్డానేమోనని భయం. ఒక్కసారి కోటు, గ్లౌవ్స్ ధరించిన తరువాత ఏకధాటిగా ఆరు గంటల పాటు మంచి నీళ్లు తాగకుండా, బాత్రూమ్‌కు కూడా వెళ్లకుండా పనిచేయాల్సి ఉంటుంది.

 

 

ఇలాంటి పరిస్దితుల్లో ఎదురయ్యే ఒత్తిడి కారణంగా నేను శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా అలసిపోతున్నారు. ఇది నేను మాత్రమే ఎదుర్కొంటున్న పరిస్థితి కాదు, నాలాగే ఎంతో మంది తీవ్ర భయాందోళనకు లోనవుతున్నారు అని తెలిపింది.. ఇక నిరంతరం మాస్క్ ధరించడం వల్ల తన మొహం ఎలా ఒరుసుకుపోయిందో చూపిస్తూ ఓ సెల్ఫీ కూడా జత చేశారు. ప్రస్తుతం ఈ విషయం తెలిసిన నెటిజన్స్ ‘అలేసియా.. నువ్వు, నీలాంటి వారే నిజమైన దేవతలు. థాంక్యూ అంటూ వేలాదిగా ఇటలీ వైద్య సిబ్బందికి తమ మద్దతు తెలుపుతున్నారట.. 

మరింత సమాచారం తెలుసుకోండి: