కరోనా వైరస్ చైనాలో మొదలై పలు  దేశాల్లో అత్యంత ప్రమాదకరంగా విస్తరిస్తోంది.  కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు ముమ్మరం చేసింది. ఢిల్లీ వ్యాప్తంగా అన్ని స్కూళ్లు, కాలేజీలను మూసివేయాలని ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే  కరోనా వైరస్ పేషంట్ల కోసం 25 ఆస్పత్రుల్లో 168 ఐసోలేషన్ బెడ్లను ఏర్పాటు చేశామన్నారు. అంతేకాకుండా కరోనా వైరస్ సోకిందనే అనుమానంతో హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న వారికి పెయిడ్ లీవ్స్ ఇవ్వాలని సంస్థల యాజమాన్యానికి రిక్వెస్ట్ చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. 

 

మాస్క్‌లు, శానిటైజర్లు అధిక ధరలకు అమ్మకుండా నిఘా పెట్టామని చెప్పగా.. అధికధరలకు మాస్క్‌లు, శానిటైజర్లు విక్రయిస్తున్న వారిపై ఏం చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ నెల 31వ తేదీ వరకు మూసే ఉంచాలని, పరిస్థితిని బట్టి దీనిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. వార్షిక పరీక్షలు ఉన్న నేపథ్యంలో సెకండరీ (11, 12 క్లాసులు) తరగతులకు మాత్రం బోధన కొనసాగించవచ్చని మినహాయింపు ఇచ్చారు. ఢిల్లీలో కొత్తగా కరోనా వైరస్ కేసులు నమోదైన నేపథ్యంలో కేజ్రీవాల్ ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ తో సమావేశమయ్యారు. తర్వాత పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు. 

 

ప్రస్తుతం భారత దేశంలో కేరళలో ఈ కరోనా ఎఫెక్ట్ తీవ్రంగా ఉండగా.. నేడు ఏపిలో తొలి కేసు నమోదు అయ్యింది.  ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తికి ఈ కరోనా సోకినట్లు వైద్యులు తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో కరోనా ఎఫెక్ట్ బాగానే ఉన్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే 70 మందిరిక పైగా భారత్ లో కేసులు నమోదు అయ్యాయి.  అయితే ఢిల్లీలో ఈ నెల 31వ తేదీ వరకు స్కూళ్లు, కాలేజీలతో పాటు సినిమా హాళ్లను కూడా మూసివేయాలని ఆదేశించారు. ప్రధాన ఆస్పత్రుల్లో తగినన్న బెడ్లను అందుబాటులో ఉంచాలని, క్వారంటైన్ సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: