ఏపిలో ఇప్పుడు రాజకీయాలు బాగా వెడెక్కి పోతున్నాయి.  ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అనూహ్య మార్పులు జరుగుతున్నాయి. ఎంతో మంది టీడీపీ, జనసేన నేతలు వైసీపీ తీర్థం పుచ్చకుంటున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో ఆయా పార్టీల అధినేతలకు మింగుడుపడకుండా ఉంది.  తాజాగా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేసిన విమర్శలు చేసిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు.  పవన్ వ్యాఖ్యలు అర్థరహితమని, నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగుతుంటే పవన్ కు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. 

 

మాచర్ల ఘటనపై పవన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ.. గతంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాహనంపై ఇటీవల దాడి జరిగినప్పుడు పవన్ ఎందుకు మాట్లాడలేదు? మాచర్లలో టీడీపీ నేతలు లేరని చెప్పా, నిన్న వాళ్లిద్దరూ ఇక్కడికి వచ్చింది అంటూ సెటైర్లు విసిరారు.  కానీ వైసీపీ నేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అలా కాదని.. ఏదైనా సరైన పద్దతిలో మాట్లాడుతారని అన్నారు.  బోండా ఉమా ఎన్ని అక్రమాలకు పాల్పడ్డాడో తమతో వస్తే చూపిస్తామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

 

గతంలో టీడీపీ పాలనలో ఉన్నపుడు ఎన్నో అక్రమాలు జరిగాయి.. కానీ వాటిని ఒక్కరూ ఏలెత్తి చూపించలేదే.. ఇప్పుడు ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూపిస్తూ విమర్శలు చేయడం పవన్, బోండాకు బాగా అలవాటైందని అన్నారు.  అప్పట్లో విజయవాడలో బొోండ ఆధ్వర్యంలో ఎన్నో అల్లర్లు.. అక్రమాలు జరిగాయి.. అన్యాయంగా వైసీపీ నేతలను ఇరుకున పెట్టి ఇబ్బందులు పెట్టారు.   వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష నేతలు విమర్శలు చేయడం పనిగా పెట్టుకున్నారు.  అంతే కాదు రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి ఎన్నికల్లో లబ్ది పొందాలని చూస్తున్నారని విమర్శించారు వైసీపీ నేత ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు.

మరింత సమాచారం తెలుసుకోండి: