ఈ లోకంలో పొగడ్తలకు పడిపోని మనుషలు చాలా అరుదు.. అందుకే ఎవరైనా తమ పని సానుకూలంగా జరిగిపోవాలంటే ఎదుటి వారిని పొగడ్తలతో ముంచెత్తుతారు. ఉన్నదానికి ఇంకాస్త కలిపి జోడించి.. మీరు ఆహా.. మీరు ఓహో.. అంటూ మునగ చెట్టు ఎక్కిస్తారు. ఇలాంటి సమయాల్లో చాలా మంది పొగడ్తలకు దాసోహం అవుతారు.. నిజంగానే తాము అంత గొప్పోళ్లమేమో అని ఫీలైపోతారు.

 

 

అక్కడే మొదలవుతుంది అసలు తంటా.. ఈ పొగడ్తల కారణంగా తల పొగురు పెరుగుతుంది. నలుగురూ మెచ్చుకోవడం ప్రారంభమయ్యేసరికి.. మన అంతటి వాళ్లు లేరు అనుకుంటారు.. ఆ తలపొగరు, గర్వం వ్యక్తిని నాశనం చేస్తాయి. అందుకే విజ్ఞులు పొగడ్తలను ఇష్టపడరు. మెగాస్టార్ చిరంజీవి కూడా అంతే. ఇండస్ట్రీలో పెద్ద మనిషిగా ఇప్పుడు చిరంజీవి అనేక కార్యక్రమాలకు వెళ్తుంటారు. మెగాస్టార్ ను చూడగానే చాలా మంది పొగడ్తలతో ముంచెత్తుతారు.

 

 

అప్పుడు.. చిరంజీవి ఏంచేస్తారో తెలుసా.. తనను ఎవరైనా పొగిడితే చిరంజీవి సంబరపడిపోరు. సినిమా వేడుకల్లో చిరంజీవిని బాగా పొగిడినప్పుడు ఇంటికి వెళ్లగానే చిరంజీవి నేల మీద పడుకుంటారట. ఎందుకంటే గర్వం రాకూడదు కదా !.. సినిమాలు విజయం సాధించి, ఎవరైనా ప్రశంసల వర్షం కురిపించినప్పుడు అది తన ఒక్కడి గొప్పతనం మాత్రమే కాదని చిరంజీవి ఫీలవుతారట.

 

 

ఆ విజయం వెనుక ఎంతో మంది కళాకారులు, శ్రామికుల కష్టం ఉందని చిరంజీవి భావిస్తారట. అంతే కాదు.. ఎవరైనా విమర్శించినా చిత్ర బృందం మొత్తం సమష్టిగా ఫెయిల్‌ అయ్యామనే చిరంజీవి నమ్ముతారట.. ఈ రెండు విషయాల్లో చిరంజీవి నిజాయతీగా ఉంటారు.. కాబట్టే విజయాలు, పరాజయాలను ఒకేలా తీసుకుంటారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: