ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సెగ చాలా వేడిగా ఉంది. మాచర్ల లో జరిగిన ఘటన చుట్టూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఏపీ రాజకీయాన్ని తిప్పాలని ప్రయత్నాలు గట్టిగా చేస్తున్నారు. మరోపక్క అధికారంలో ఉన్న వైసీపీ పార్టీలోకి ఇతర పార్టీలకు చెందిన నాయకులు వరుసబెట్టి జాయిన్ అవ్వడానికి క్యూ కడుతున్నారు. ఇటువంటి కీలకమైన టైములో అధికార పార్టీ లోకి ఇటీవల తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే కరణం బలరాం కొడుకు జగన్ సమక్షంలో చేరటం జరిగింది. ఈ పరిణామంతో చాలా వరకు తెలుగుదేశం పార్టీ యొక్క పునాదులు మొత్తం రాబోయే సంవత్సరం లోపు పూర్తిగా కదిలిపోతూ చంద్రబాబు రాజకీయానికి శుభం కార్డు పడిపోవటం గ్యారెంటీ అనే టాక్ ప్రస్తుతం ఏపీలో బలంగా వినపడుతోంది.

 

స్థానిక సంస్థల ఎన్నికలలో గెలవలేని పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఉండటంతో... ఇటువంటి తరుణంలో రాష్ట్రంలో కావాలని శాంతిభద్రతల సమస్యలను ప్రశ్నించడానికి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని వైసిపి పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా రాష్ట్రంలో జరుగుతున్న గొడవల నుద్దేశించి మంత్రి బొత్స సత్యనారాయణ చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకు పోయిందని, స్థానిక ఎన్నికల్లో 10 శాతం కూడా రాదన్న భయంతో టీడీపీ నేతలు ఇదంతా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. రూ. 100 కోట్లు ఖర్చు పెట్టి కొడుకుని గెలిపించుకో లేకపోయారని చంద్రబాబు పై సెటైర్లు వేశారు.

 

తీవ్ర అభద్రతాభావంతో చంద్రబాబు రాజకీయాలు చేస్తూ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూడలేక కుళ్ళు కుంటున్నారు అంటూ మండిపడ్డారు. దాదాపు చంద్రబాబు పొలిటికల్ చాప్టర్ క్లోజ్ అయినట్లే అన్నట్టుగా బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం వైసీపీ పార్టీలోకి ఇతర పార్టీల నాయకులు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి మరియు సంక్షేమం బట్టి వస్తున్నారని బొత్స సత్యనారాయణ క్లారిటీ ఇచ్చారు. ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ పార్టీ భారీ స్థాయిలో స్థానాలు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: