ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి నిన్నటితో పదేళ్ళు పూర్తి అయిన విషయం తెలిసిందే. నిన్న జగన్ అతని పార్టీ స్థాపన జరిగి దశాబ్దం ముగిసిన సందర్భంగా చాలా భావోద్వేగంతో మాట్లాడారు కూడా. అయితే తనకి ఇప్పుడు వచ్చిన సీఎం పదవి ఏమీ అంత సులభంగా దక్కలేదు. ఎన్నో అడ్డంకులను, ఒత్తిళ్లను, ఒడిదుడుకులను, కుట్రలను తట్టుకొని ఆయన ఇప్పుడు స్థాయిలో నిలబడ్డారు.

 

అయితే సరిగ్గా రెండేళ్ల ముందే జగన్ కు తన భవిష్యత్ ఎలా ఉండబోతుందో అర్థమైపోయింది. గతంలో జగన్ విశాఖకు యాత్ర చేయడానికి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర పార్టీ టీడిపి కార్యకర్తలతో జగన్ ను అడ్డుకుని కనీసం విమానాశ్రయణ్ నుండి బయటకు కూడా రానివ్వలేదు. తర్వాత జగన్ ఎక్కవలసిన విమానం రన్ వే పైన ఉన్నప్పుడు అధికారులు కావాలనే అతని లేనిపోని కారణాలు చెప్పి ఆపేశారు.

 

అప్పుడు జగన్ తన సహనం కోల్పోయి అసలు నన్ను ఎందుకు ఆపుతున్నారు అని వారిని కడిగేశాడు. వారి దగ్గర సరైన సమాధానం రాకపోగా వారు కావాలని తాత్సారం చేస్తుండడంతో విషయం పసిగట్టిన జగన్.... ప్రతి ఒక్కరిని.... మీ అందర్నీ గుర్తుపెట్టుకుంటా రెండేళ్ల తర్వాత నేను అంటే ఏంటో చూపిస్తానని శపధం చేశాడు.

 

కట్ చేస్తే 2020 లో చంద్రబాబు నాయుడు అదే విశాఖ ఎయిర్ పోర్ట్ లో ప్రజా చైతన్య యాత్ర కోసం 3 రాజధానుల విషయంలో వైజాగ్ ప్రజలను మభ్యపెట్టేందుకు బయలుదేరగా రోజు జగన్ అడ్డగించిన అదే ఉత్తరాంధ్ర ప్రజలు ఈసారి చంద్రబాబు తమకు దక్కాల్సిన గుర్తింపు దక్కకుండా చేస్తున్నాడు అని ఎవరి ప్రమేయం లేకుండానే అతనిని ఎయిర్పోర్టులోనే అడ్డగించే గుడ్లు, చెప్పులతో స్వాగతం పలికారు. జగన్ తన పదేళ్ళ రాజకీయ ప్రస్థానంలో నేర్చుకున్నది మాట మీద నిలబకడ, ఎన్నటికీ వెనకడుగు వేయని మొండితనం అని ఇంకా ప్రత్యేకంగా చెప్పాలా.

మరింత సమాచారం తెలుసుకోండి: