డేటింగ్ యుగంలో కూడా జనాలకు వ్యభిచారం మీద మోజు పోవట్లేదు. ఊరు, పేరు, భాష, సంస్కృతి తో తేడా లేకుండా మన దేశం మొత్తం వ్యభిచార గృహాల తో నిండిపోయింది. ఎంతో మంది సెక్స్ వర్కర్లుగా పనిచేస్తూ తన శరీరం అమ్ముకొని వేలకు వేలు సంపాదిస్తున్నారు. ఇక విటులు చూస్తే అటు కుటుంబాన్ని ఇటు వింత జబ్బు బారిన పడి తమ జీవితాన్ని కూడా నాశనం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం అయిన మంగళగిరి మండలం లో దొరికిన సెక్స్ రాకెట్ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది.

 

మంగళగిరి మండలం చినకాకాని గ్రామంలో ఇద్దరు మహిళలు కొంతకాలంగా గుట్టుగా వ్యభిచారం చేస్తూ ఉన్నారు. చినకాకాని గ్రామ పంచాయతీ పరిధిలోని రాజ్‌కమల్‌ రోడ్డులో ఇద్దరు మహిళలు కొంత కాలంగా ఇల్లును అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నారు. వారింటికి తరుచూ అపరిచిత వ్యక్తులు వస్తుండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనిపై నిఘా పెట్టిన మంగళగిరి రూరల్ సీఐ పి.శేషగిరిరావు మంగళవారం సిబ్బందితో కలిసి రైడ్ నిర్వహించారు.

 

సందర్భంగా వారు అక్కడ వ్యభిచారాన్ని ఒక పైలట్ ప్రాజెక్టు లాగా స్టార్ట్ చేసిన ఇద్దరు మహిళలతో పాటు ఒక విటుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇంటి నుండి నలభై మూడు వేల రూపాయల నగదు మరియు మూడు సెల్ ఫోన్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక వారిపై కేసు దర్యాప్తు చేసి విచారణ చేపట్టగా వారు చెప్పిన విషయాలు పోలీసులను నివ్వెరపరిచాయి.

 

విషయం ఏమిటంటే మామూలుగా నెట్వర్క్ ఇంట్లోనే కాకుండా కాలేజీ అమ్మాయిలలో కూడా ఉందని దేశంలో ప్రతి మూల వారు ఇలాగే ఒక ఊరికి వచ్చి తర్వాత కాలేజీ అమ్మాయిలకు మరియు ఒంటరి ఆడవాళ్లకు డబ్బు ఆశ చూపించి ఊబిలోకి లాగుతారని వివరించారు. పోలీసులు కొంచెం ఆలస్యం చేసి ఉంటే ఇది ఇంకా ఎన్ని జీవితాలు నాశనం చేసేదో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: