ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నింటికీ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా వైరస్ రోజురోజుకీ వ్యాపిస్తూ అల్లకల్లోలం సృష్టిస్తోంది. తొలుత చైనాలో మొదలెత్తుకున్న మహమ్మారి అంచలంచలుగా ప్రపంచ దేశాలన్నింటికీ విస్తరించింది. అయితే చైనాలో కేసులు మరియు మరణాలు తగ్గుముఖం పట్టాయి. వారి ప్రభుత్వం కూడా ఇదే విషయాన్ని సగర్వంగా ప్రకటించుకుంది. అయితే ఇప్పటికే ప్రమాదకర వైరస్ 4,300 మందిని పొట్టన పెట్టుకుంది. చైనా తర్వాత ఇటలీ, ఇరాన్ మరియు దక్షిణ కొరియా లో ఎక్కువ మంది చనిపోయినట్లు సమాచారం.

 

కానీ ఇప్పుడు మొత్తం ప్రపంచాన్ని విస్మయపరుస్తున్న విషయం ఏమిటంటే ఉత్తరకొరియా లో కరోనా వల్ల దాదాపు 200 మంది సైనికులు చనిపోయారట. అయితే దేశం మాత్రం విషయాన్ని వెల్లడించలేదు. ఇప్పటికే కరోనా సోకింది అని తెలిసి బాధితుడిని ఉత్తరకొరియా అధ్యక్షుడు ఆదేశాల మేరకు కాల్చి చంపినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే గత రెండు నెలల వ్యవధిలో 180 మందికి పైగా సైనికులు చనిపోయినట్లు దక్షిణ కొరియాకు చెందిన వార్తాసంస్థ డైలీ ఎన్ కే ఒక కథనాన్ని ప్రచురించింది. అలాగే చనిపోయిన 180 మంది సైనికులు కాక దాదాపు 3500 మంది సైనికులను క్వారంటైన్ సెంటర్లకు కూడా తరలించినట్లు తెలిపింది.

 

అయితే మృతి చెందిన వారిలో ఎక్కువగా చైనా సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న సైనికులే ఎక్కువగా ఉన్నారని ఉత్తర కొరియా కు చెందిన మిలటరీ వైద్య అధికారి విషయాన్నీ బయటపెట్టినట్లు తన కధనంలో పేర్కొంది. అయితే విషయం పై ఉత్తర కొరియా ఎలాంటి ప్రకటన చేయలేదు కానీ దక్షిణ కొరియా వార్తా సంస్థ కధనాన్ని ప్రచురించింది. జనవరి,ఫిబ్రవరి నెలల్లోనే ఇంతమంది చనిపోయారని,అయితే మార్చి లో కూడా మరిన్ని మరణాలు సంభవించి ఉండొచ్చు అని వార్తా సంస్థ అభిప్రాయపడింది. అయితే ఇంత ప్రాణనష్టం జరుగుతున్నా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మాత్రం విషయం బయటకు పొక్కకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: