మనుషికి ఆశ ఉండాలి కానీ అతి ఆశ పనికి రాదాన్న విషయం తెలిసిందే.. ఇక మగవానికి కలిగే ఆశ వల్ల జీవితం నాశనం చేసుకుంటుంటే.. ఆడవారు ఈ అత్యాశ వల్ల తమ మానప్రాణాలను కోల్పోతున్నారు.. ముఖ్యంగా అతిగా ఆకర్షించే సినిమాలో అవకాశాలు అనే పదాన్ని వాడుకుని ఎందరో అమ్మాయిలు చేజేతులారా వ్యభిచారిణులుగా మారుతున్నారు.. ఇలా ఎందరో పట్టుబడి పరువు పోగొట్టుకుంటున్న, ఈ తప్పు చేసేవారు చేస్తూనే ఉన్నారు..

 

 

ఇకపోతే ఈ నగరం వ్యభిచారాలకు అడ్డగా మారుతున్నదన్న విషయం తెలిసిందే.. ఇక్కడ గుట్టుచప్పుడు కాకుండా సెక్స్ రాకెట్లు నడుస్తూనే ఉంటాయి. బ్యూటీ పార్లర్లు మసాజ్ సెంటర్ల పేరుతో పలువురు వ్యభిచార కేంద్రాలు నిర్వహిస్తుంటారు. ఆన్ లైన్ ద్వారా విటులను ఆకర్షిస్తూ అమ్మాయిలను ఎరగా వేస్తుంటారు. ఇదే కాకుండా సినిమాలు టీవీల్లో చాన్సుల కోసం అని ఆశపడి నగరానికి వచ్చిన యువతులను మభ్యపెట్టి సెక్స్ వర్కర్లుగా మారుస్తున్నారు.. ఇలాంటి ఉచ్చులో మరికొందరు యువతులు చిక్కుకున్నారు.. ఆ వివరాలు తెలుసుకుంటే..

 

 

హైదరాబాద్ లోని బాలానగర్ పీఎస్ పరిధిల పాపయ్య యాదవ్ నగర్ లో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై పోలీసులు బుధవారం దాడి చేయగా, అక్కడ ఓ యువతితో పాటు కే. శ్రీనివాస్ అనే వ్యక్తి పట్టుబట్టారు. ఇక ఆ యువతిని విచారించగా, సినిమా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి తనతో వ్యభిచారం చేయిస్తున్నట్టు పోలీసుల ముందు బోరుమంది. ఇక ఈ వ్యభిచార కేంద్రాన్ని నిర్వహిస్తున్న దుర్గాప్రసాద్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.ఇతడు సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్ గా పనిచేస్తుంటాడని పోలీసులు తెలిపారు.

 

 

ఇతన్ని విచారించగా సినిమా అవకాశాల కోసం వచ్చిన చాలా మంది యువతులను నమ్మించి ఇలా వ్యభిచార కూపంలోకి లాగాడని తేలింది. ఇతనితో పాటుగా కూకట్ పల్లికి చెందిన అరిపాక కృష్ణ అనే యువకుడిని సైతం వ్యభిచారం నిర్వహిస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలా వీరంతా కలిసి అమ్మాయిలకు మాయ మాటలు చెప్పి వ్యభిచారం చేయిస్తున్నారని, ఇలాంటి వారు ఇంకా ఎందరో ఉన్నారు కాబట్టి అమ్మాయిలు సినిమా అవకాశాలంటూ మీ జీవితాలు పాడు చేసుకోకండని పోలీసులు తెలుపుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: