బిజెపి జనసేన పార్టీల రెండు ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి ముందుకు వెళుతున్నాయి. ఉమ్మడిగా అభ్యర్థులను రంగంలోకి దించుతున్నాయి. ఈ సందర్భంగా ఏపీ అధికార పార్టీ వైసీపీ పై రెండు పార్టీలకు చెందిన అగ్ర నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అయితే అదే సమయంలో బిజెపి అగ్ర నాయకులు వైసిపి తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఇక బిజెపి జనసేన పార్టీ పోటీ చేస్తున్న కొన్ని స్థానాల్లో వైసీపీ నామినేషన్ వేయకుండా అడ్డుకుంటోంది అంటూ ఈ రెండు పార్టీలు ఆరోపిస్తున్నాయి. జనసేన, బిజెపి మేనిఫెస్టో ఆవిష్కరిస్తున్న సమయంలో మేనిఫెస్టో లోని అంశాలను ప్రస్తావించకుండా, తమపై వైసిపి చేయిస్తున్న దాడుల గురించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ తదితరులు మాట్లాడారు.

IHG


 చిత్తూరు జిల్లాలో జనసేన, బీజేపీ నాయకుల పై జరిగిన దాడులుపై  నాయకులు మండిపడ్డారు. ఎన్నికల సంఘం కూడా వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న తీరుపై ఆలోచించాలని, ఈ దారుణాలు నియంత్రించేలా చర్యలు చేపట్టాలంటూ పవన్ డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఏపీలో జరుగుతున్న పరిణామాల గురించి గవర్నర్ కేంద్రం దృష్టికి తీసుకు వెళ్దామని, బీహార్ ను మించిపోయేలా ఏపీలో ఎన్నికల పరిణామాలు  చోటుచేసుకుంటున్నాయని ఆరోపించారు. జగన్ ఫ్యాక్షనిజానికి, నియంతృత్వానికి ఈ ఎన్నికలు నిదర్శనంగా కనిపిస్తున్నాయని, ఈ మాత్రం దానికి ఎన్నికల ఘట్టం ఎందుకని ఒక ఆర్డినెన్సు తెచ్చుకుని మొత్తం వైసీపీ కార్యకర్తలను పదవుల్లో నియమించుకోవాల్సిందిగా వారు సెటైర్లు వేస్తున్నారు.


 వైసిపి నాయకులు మిగతా పార్టీల నాయకులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని, టెండర్ పత్రాలు వేయనీయకుండా అడ్డుకుంటూ హడావుడి చేస్తున్నారని, ఈ విషయంలో ఎన్నికల సంఘం కూడా పెద్దగా పట్టించుకోవడం లేదని విమర్శించారు. కొన్ని చోట్ల పోలీసులు కూడా తమ అభ్యర్థులను బెదిరిస్తున్నారని, ఈ రెండు పార్టీల నేతలు అభిప్రాయపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: