దేనికైనా ఓ హద్దు ఉంటుంది.. కానీ ఈ మద్య వస్తున్న టిక్ టాక్ కి మాత్రం ఏ హద్దూ లేదంటుంటున్నారు... ఏది వెరైటీగా చేస్తే దాన్ని టిక్ టాక్ లో పెట్టి పాపులర్ కావాలని చూస్తున్నారు జనాలు.  చిన్నా పెద్దా.. ఆడా మగా నే కాదు ట్రాన్స్ జెండర్లు సైతం ఈ టిక్ టాక్ పిచ్చిలో మునిగిపోయారు. చిన్న చిన్న గ్రామాల్లో సైతం టిక్ టాక్ చేస్తూ సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నారు.  ఈ టిక్ టాక్ వల్ల ఫేమ్ కావడం సంగతి దేవుడెరుగు.. కొంత మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.  ఉద్యోగాలు.. జీవితాలే పోగొట్టుకుంటున్నారు.  అయినా కూడా జనాల తీరు మారడం లేదు.. ప్రతిరోజూ ఏదో ఒక వెరైటీ టిక్ టాక్ చేయడం.. ప్రమాదాలు కొని తెచ్చుకోవడం జరుగుతూనే ఉంది.

 

తాజాగా గుజరాత్ లో ఓ ప్రబుద్దుడు చేసిన పనికి అతన్ని చూడటానికి వెళ్లినవారు కూడా కష్టాల్లో పడ్డారు. మద్యానికి బానిసై, విచ్చలవిడిగా ప్రవర్తించిన ఓ తాగుబోతును అరెస్టు చేసి లాకప్ లో వేశారు. కాగా,  అతని నలుగురు స్నేహితులు స్టేషన్ నుకు చేరుకొన్నారు.  నలుగురిలో ఒక వ్యక్తి లాకప్‌లో తన నలుగురు స్నేహితులతో కలిసి టిక్‌టాక్ వీడియో రికార్డింగ్ చేశారు. ఆ టిక్ టాక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంకేముంది లాకప్ లో ఇలాంటి చిల్లర పనులు చేస్తూంటే మీరేం చేస్తున్నారని పోలీసుల మీదకు వచ్చింది.

 

దాంతో  పోలీసులు   ఆ వ్యక్తులను నిబంధనల ప్రకారం ఐటీ చట్టంతో పాటు పలు ఐపీసీ సెక్షన్ల కింద అరెస్టు చేసిన సంఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది. పోలీసుల  వివరాల ప్రకారం... కరన్‌సింగ్ షేఖవత్ అనే వ్యక్తి మద్యం కేసులో అరెస్టు కాడంతో పోలీస్ స్టేషన్‌లో ఉంచామని తెలిపారు. షేఖావత్‌ను చూడటానికి నలుగురు స్నేహితులు స్టేషన్‌కు రావడంతో వాళ్లతో కలిసి వీడియో రికార్డు చేసి టిక్ టాక్‌లో అప్‌లోడ్ చేశారని తెలిపారు. సీసీ కెమెరాలో రికార్డింగ్ చూశామని..  ఆ నలుగురు స్నేహితులతో పాటు షేఖవత్‌పై కఠినమైన సైబర్ చట్టం ప్రకారం, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పోలీసులు అధికారులు తెలిపారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: