ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు వలసల పర్వం మొదలైంది.  త్వరలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీలోకి ఇతర పార్టీ సభ్యులు వలసలు రావడం మొదలైంది.  గత కొంత కాలంగా స్తబ్ధతగా ఉన్న ఏపి రాజకీయాలు ఒక్కసారే వేడెక్కి పోతున్నాయి.  తాజాగా మాజీ మంత్రి, ప్రకాశం జిల్లాలో కీలక నేత శిద్ధా రాఘవరావు టీడీపీకి గుడ్ బై చెప్పనున్నారని సమాచారం. ఇప్పటికే సీనియర్ వైసీపీ నేతలతో చర్చలు జరిపిన ఆయన, నేడో, రేపో తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే పలువురు తమ నేతలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉండటంతో కుదేలవుతున్న తెలుగుదేశం పార్టీకి మరో షాక్  భారీ షాక్ అని.. మొన్నటి వరకు చంద్రబాబుకి ఆయన ఎంతో బాసటగా నిలిచారని.. ఇప్పుడు వైసీపీ తీర్థం పుచ్చుకుంటే చంద్రబాబు కి కోలుకోలేని దెబ్బే అని అంటున్నారు.

 

ప్రకాశం జిల్లాలో శిద్ధాకు దర్శి, పొదిలి ప్రాంతాల్లో అపారమైన అనుచరగణం ఉందన్న సంగతి తెలిసిందే. ఈ మద్య బాలయ్య బెస్ట్ ఫ్రెండ్ వైసీపీలోకి జంప్. అయితే టీడీపీలో తమ సేవలు ఉపయోగించుకొని ఓడిపోయిన తర్వాత తమను పక్కన బెట్టారని వలసలు వెళ్లిన వారు ఆరోపిస్తున్నారు.  డొక్కా, ఇవాళ సతీష్ రెడ్డి, కదిరి బాబురావు, వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీలో తనకు తగిన గుర్తింపును చంద్రబాబు ఇవ్వడంలేదని సతీష్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పట్ల ఆకర్షితులవ్వడమే కాకుండా, గ్రామాలను అభివృద్ధి చేస్తారని నమ్మి పార్టీలు మారుతున్నారు.

 

వైఎస్సార్‌ సీపీలో పనిచేయడం ద్వారా గుర్తింపు తెచ్చుకోవడానికి కృషి చేస్తున్నారు. అంతే కాదు టీడీపీ నుంచి పోటీ చేసే అభ్యర్థులు లభించక జిల్లా నాయకత్వం నానా ఇబ్బందులు పడుతోంది. ఈ స్థాయిలో క్యాడర్‌ పార్టీని వీడితే టీడీపీ అభ్యర్థులకు గెలుపు కష్టమేనని పార్టీలోని సీనియర్‌ నాయకులు అభిప్రాయపడుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: