రోజురోజుకి బంగారం కొద్దికొద్దిగా ధర పడిపోతూనే వస్తోంది. ఇదే కొనసాగింపుగా వరుసగా నాలుగో రోజు కూడా బంగారం ధర పతనమైంది. ఎంసీఎక్స్ మార్కెట్‌ లో శుక్రవారం నాడు గోల్డ్ ఫ్యూచర్స్ ధర ఏకంగా ఒక్కరోజే రూ.763 దిగొచ్చింది. దీనీతో 10 గ్రా. బంగారం ధర మార్కెట్ లో రూ.41,443కు చేరింది. ప్రపంచ వ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తడం ఇందుకు అసలైన  కారణం. దీనితో పాటు బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా పయనించింది. ఎంసీఎక్స్ మార్కెట్‌ లో వెండి ఫ్యూచర్స్ ధర 2 శాతం పడిపోయి రూ.1,000 దిగొచ్చింది. దీనితో కేజీ వెండి ధర రూ.43,179కుచేరింది. కాకపోతే ఇంతక ముందు సెషన్‌ లో బంగారం ధర 10 గ్రాములకు రూ.1,100 నష్టపోయింది. అలాగే వెండి కూడా కేజీకి రూ.1600 తగ్గింది. ఈ దెబ్బతో బంగారం ధర కేవలం రెండు రోజుల్లో రూ.2,000కు పైగా పడిపోయింది.

 

 


మాములుగా బంగారాన్ని ఒక సురక్షితమైన ఇన్వెస్ట్మెంట్ గా భావిస్తారు. కాకపోతే గ్లోబల్ మార్కెట్ల పతనం కారణంగా బంగారంపై కూడా దాని తీవ్రత పడింది. కరోనా వైరస్ దెబ్బకి ప్రపంచ కేంద్ర బ్యాంకులు తీసుకుంటున్న చర్యల వల్ల ప్రయోజనం అంతగా ఉండకపోవచ్చనే అంచనాలు తెల్పుతున్నాయి. 

 

 

 

 

ఒక అంచనా ప్రకారం అంతర్జాతీయ మార్కెట్‌ లో బంగారం ధర ఈ వారంలో బాగా కిందికి దిగే అంచనాలున్నాయి.  వారంలో బంగారం ధర ఈస్థాయిలో తగ్గనుండటం మూడు సంవత్సరాలలో ఇదే తొలిసారి కావొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. కఇక పోతే గతవారం బంగారం ధర గ్లోబల్ మార్కెట్‌ లో ఇటీవలనే ఏడేళ్ల గరిష్ట స్థాయికి చేరిన విషయం అందరికి తెలిసిందే. గ్లోబల్ మార్కెట్‌ లో స్పాట్ గోల్డ్ బంగారం ధర ఈ రోజు 1.3 శాతం పడిపోయింది.  కాకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు కూడా చాలానే ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: