కొంత కాలంగా భారత దేశంలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు ఎంతగా పెరిగిపోతున్నాయో ప్రతిరోజూ వస్తున్న వార్తలే చెబుతున్నాయి.  చిన్నారులని కూడా చూడకుండా కామంతో కళ్లు మూసుకు పోయి దుర్మార్గులు అత్యాచారం చేసి చంపేస్తున్నారు.  ప్రతిరోజూ ఈ కేసు వార్తలు ఎక్కడ అక్కడ వినిపిస్తూనే ఉన్నాయి.  తాజాగా ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తండ్రి హత్య కేసులో బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్‌దీప్‌సింగ్‌ సెంగార్‌కు పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఢిల్లీ కోర్టు తీర్పు వెలువరించింది.  ఒక బాధ్యత గల ఎమ్మెల్యే అయి ఉండి అత్యాచారం కేసులో శిక్ష అనుభవిస్తున్న కుల్ దీప్ సింగ్ ఇప్పటికే బీజేపీ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే.

 

అతని సోదరుడు అతుల్‌ సింగార్‌కు కూడా ఇదే విధమైన శిక్షను విధించింది. అదేవిధంగా బాధిత కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం చెల్లించాలని కుల్‌దీప్‌సింగ్‌ సెంగార్‌, అతని సోదరుడిని కోర్టు ఆదేశించింది. 2017లో ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో ఎమ్మెల్యే కుల్‌దీప్‌సింగ్‌ సెంగార్‌  ఓ మైనర్‌ను అత్యాచారం చేశాడు.  అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ సంచలనం రేపిన విషయం తెలిసిందే.  కాగా హత్యాచారం కేసు నడుస్తుండగానే బాధితురాలి తండ్రి లాకప్ లో చనిపోయాడు. ఈ మరణం వెనుక కుల్దీతోపాటు మరో ఆరుగురి పాత్ర ఉందన్న ఆరోపణల పై కేసు నమోదైంది. ఈ కేసు విచారించిన తీహజారీ కోర్టు కుల్దీప్ తోపాటు మరో ఆరుగురు దోషులకు పదేళ్ల జైలు శిక్ష విధించింది. 

 

 9 ఏప్రిల్‌,2018న జూడిషియల్‌ కస్టడిలో ఉండగానే మృతిచెందాడు.  అంతే కాదు  బాధితురాలి కుటుంబానికి కుల్దీప్ రూ.10 లక్షలు పరిహారంగా చెల్లించాలని తీర్పునిచ్చింది. అదే విధంగా కుల్దీప్ సోదరుడు అతుల్ సెంగార్ కూడా బాధిత కుటుంబానికి మరో రూ.10 లక్షలు పరిహారంగా ఇవ్వాలని తీర్పు చెప్పింది.  కాగా, ఈ అత్యాచార కేసు విషయంలో అప్పట్లో బీజేపీ పై విమర్శలు రావడంతో అతన్ని బహిష్కరించిన విషయం తెలిసిందే. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: