నేటి సమాజంలో యువత సోషల్ మీడియాలో చాలా ఆక్టివ్ గా ఉంటున్నారు. చదువుతో సంబంధం లేకుండా చిన్న,పెద్ద అందరు ఇంటర్ నెట్ ను ఉపయోగిస్తున్నారు. పిల్లలు చెడిపోతున్నారు అనడానికి ఈ ఘటన నిదర్శనం.

 

అతడు చదివింది బీటెక్. టెక్నాలజీ వాడటంతో దిట్ట. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌ ద్వారా యువతులు, వివాహితలను వలలో వేసుకుని కోరిక తీర్చాలని వేధించడం, కాదన్న వారిని బ్లాక్‌మెయిల్ చేయడం అతడికి వెన్నతో పెట్టిన విద్య. 


ఈ కీచకుడు షాపింగ్‌మాల్‌లో పరిచయమైన యువతిని కూడా అలాగే వేధించాడు. ఆమెను బలవంతంగా కారులో ఎక్కించుకుని కిడ్నాప్ చేసి అత్యాచారం చేసేందుకు యత్నించాడు. బాధితురాలు చాకచక్యంగా తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది. దింతో కామాంధుడి లీలలు వెలుగులోకి వచ్చాయి. 

 

నాగులుప్పలపాడు మండలం చీర్వానుప్పలపాడుకు చెందిన కొల్లూరి చైతన్య దుబాయ్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పని చేసి ఏడాది క్రితం స్వగ్రామానికి వచ్చేశాడు. అప్పటి నుంచి మహిళలు, యువతులను మోసగించడం, బ్లాక్‌ మెయిల్‌ చేయడం ప్రారంభించాడు.

 

ఒంగోలులోని ఓ షాపింగ్‌మాల్‌లో కొద్దిరోజుల క్రితం యువతి పర్సు పోగొట్టుకుంది. అక్కడే ఉన్న చైతన్య ఆమెకు పర్సు వెతికి పెట్టాడు. ఆ పరిచయంతో ఆమె ఫోన్‌ నంబర్‌ తీసుకుని కొద్దిరోజుల పాటు ఛాటింగ్‌ చేసి శారీరకంగా లొంగదీసుకునేందుకు ప్రయత్నించాడు.

 

అదే క్రమంలో ఆమెను నాగులుప్పలపాడు రావాల్సిందిగా బెదిరింపులకు గురిచేశాడు. అక్కడికి వచ్చిన ఆమెను కారులో ఎక్కించుకుని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడు. భయాందోళనలకు గురైన ఆ యువతి కేకలు వేసుకుంటూ అక్కడి నుంచి పారిపోయింది. అనంతరం నాగులుప్పలపాడు పోలీసులకు ఫిర్యాదు చేయగా చైతన్యను అరెస్ట్ చేశారు.

 

జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత సెల్వం కోసం తమిళనాడు వెళ్లాడు. అక్కడ అతడి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఒంగోలులో ఓ వివాహితతో ఫేస్‌బుక్‌, ఇన్‌స్ర్టాగ్రామ్‌లో పరిచయం పెంచుకొని ఆమెను బ్లాక్‌మెయిల్‌ చేసినట్లు ఆరోపణలున్నాయి.

 

గుంటూరులో మెడిసిన్‌ చదువుతున్న విద్యార్థినిని ఇదేవిధంగా మోసం చేయడంతో ఆమె తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు. నేరాలకు అలవాటు పడిన చైతన్యపై రౌడీషీట్‌ తెరిచామని ఒంగోలు పోలీసులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: