మహారాష్ట్ర రాజకీయాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత  ఎన్నో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీకి సరైన మెజారిటీ కట్టబెట్టకపోవడంతో... ఎన్నో  అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి . ముందుగా శివసేన బీ జె పీ కూటమికి మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ మొత్తంలో అసెంబ్లీ స్థానాలు గెలిసినప్పటికీ... శివసేన రెండున్నరేళ్ల పాటు ముఖ్యమంత్రి పదవిని ఆశించడం తో బీజేపీ పార్టీ దానికి అంగీకరించలేదు. ముఖ్యమంత్రి పదవిపై మొండిపట్టు తో ఉన్న శివసేన పార్టీ... బిజెపి కూటమి నుంచి విడిపోయింది. దీంతో బిజెపి పార్టీ అయోమయంలో పడిపోవాల్సిన  పరిస్థితి ఏర్పడింది. దీంతో ఎన్సీపీ  కాంగ్రెస్ పార్టీలు మహారాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారిన విషయం తెలిసిందే. 

 

 

 ఇకపోతే బీజేపీ పెద్దలందరూ  రాత్రికి రాత్రి మంతనాలు జరిపి ఎన్సీపీ నేత అజిత్ పవర్ ని మచ్చిక చేసుకొని  ఏకంగా ముఖ్యమంత్రి గా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణస్వీకారం చేయగా... ఆ తర్వాత బలనిరూపణ చేసుకోలేక బీజేపీ ప్రభుత్వం కూలిపోయింది. ఇక చివరికి శివసేన పార్టీ ఎన్సీపీ కాంగ్రెస్ పార్టీల మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే శివసేన పార్టీ ఎన్సీపీ కాంగ్రెస్ పార్టీల మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి.. బీజేపీ నేతలు పలువురు శివసేన పార్టీతో కలవడానికి సిద్ధంగా ఉన్నామంటూ వ్యాఖ్యలు చేయడం మహా రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని సంతరించుకున్న  విషయం తెలిసిందే. 

 

 

 తాజాగా మరోసారి బిజెపి సీనియర్ నేత మహారాష్ట్ర అసెంబ్లీ వేదికగా  సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో శివసేన పార్టీని తాము గతంలో మోసం చేశాము  అంటే మాజీ ఆర్థికశాఖ  మంత్రి సుదీర్ ముంగతివార్  అంగీకరించారు.భవిష్యత్ లో  బిజెపి శివసేన పార్టీ లతో  మళ్లీ కలిసి నడుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు ఆయన . శివసేన పార్టీ అధినేత ఉద్ధవ్ థాకరే... ఎన్సీపీ అనుబంధం కేవలం మూడు నెలలు మాత్రమే అంటూ వ్యాఖ్యానించిన  ఆయన.. శివసేన పార్టీ తో బీజేపీ అనుబంధ మాత్రం మూడు దశాబ్దాల కాలం నాటిది అంటూ వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: