తెలంగాణ ప్రజలందరికీ కేసీఆర్ సర్కార్ వరుస  షాక్ లు ఇస్తున్న విషయం తెలిసిందే. యాభై రోజులకు పైగా  ఆర్టీసీ సమ్మె చేసిన అనంతరం ఆర్టీసీ కార్మికులు అందరూ సమ్మె విరమించగా... ఆర్టీసీ కార్మికులకు అందరికీ వరాలు కురిపించి ఆర్టీసీ చార్జీలు పెంచి ఆర్టీసీ మనుగడ భారాన్ని ప్రజలపై మోపేంది  తెలంగాణ సర్కార్. టికెట్ చార్జీలు పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకోవడంతో పాటు ఆర్టీసీ కార్మికులు ఆనందం వ్యక్తం చేసినప్పటికీ... ఛార్జీల పెంపుతో తెలంగాణ ప్రజానీకం మొత్తం కాస్త నిరాశ చెందింది. ఇక ఆ తర్వాత మద్యం ధరలు కూడా భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సామాన్య ప్రజలకు మద్యం ధరలు కూడా భారంగానే మారిపోయాయి అది చెప్పాలి. 

 

 

 ఈ నేపథ్యంలో కేసీఆర్  సర్కారు తెలంగాణ ప్రజానీకానికి మరో భారీ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో విద్యుత్ ఛార్జీలు పెంచే ఆలోచనలో కేసిఆర్ సర్కార్ ఉన్నట్లు సమాచారం. త్వరలో విద్యుత్ చార్జీలు పెంచేందుకు ఇప్పటికే ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తోంది తెలంగాణ సర్కార్. దీనిపై అసెంబ్లీ వేదికగా స్పష్టత ఇచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్. త్వరలో తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపు ఉండటం ఖాయం అన్నట్లుగా తెలిపారు. త్వరలోనే రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలను పెంచుతున్నట్లు అసెంబ్లీ వేదికగా ప్రకటన చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. 

 

 

 ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా విద్యుత్ ఛార్జీల పెంపు తప్పనిసరి అని... రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లోటు బడ్జెట్ లో ఉన్నందున ఒక వేళ విద్యుత్ ఛార్జీల పెంపు చేపట్టకపోతే... విద్యుత్ సరఫరా సంస్థల మనుగడ కష్టతరం అవుతుంది అంటూ అసెంబ్లీ వేదికగా చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్. అదేసమయంలో దళితులకు గిరిజనులకు 101 యూనిట్లు విద్యుత్ ను ఉచితంగా ఇస్తున్నాము అంటూ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచినప్పటికీ పేద ప్రజలపై మాత్రం ఎలాంటి భారం పడబోదు  అంటూ స్పష్టం చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. రోజురోజుకు విద్యుత్ వినియోగం పెరుగుతున్న వేల ఛార్జీల పెంపు తప్పనిసరి అని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: