తెలుగుదేశం పార్టీకి ఒకవైపు ఓటమి భయం తో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు ఫోన్ లను అధికార పార్టీ వైసీపీ ట్యాప్ చేస్తుందేమోనని భయం వెంటాడుతోంది. గతంలో ఒకసారి టిడిపి అధినేత చంద్రబాబు తెలంగాణాలో ఓటుకు నోటు కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడిన గొంతు కూడా బయటకు వచ్చింది. 2015 లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఈ వ్యవహారం చోటుచేసుకోవడంతో పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిలో ఉండే హక్కు ఉన్నాసరే ఆగమేఘాల మీద చంద్రబాబు అమరావతికి పయనమయ్యారు. ఆ వ్యవహారం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. చంద్రబాబు ఆంగ్లో-ఇండియన్ ఎమ్మెల్సీ స్టీఫెన్సన్ తో మాట్లాడుతున్న ఫోన్ కాల్ రికార్డు బయటకు వచ్చింది. మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అనే చంద్రబాబు మాటలతో ప్రారంభమైన ఆడియో తీవ్ర సంచలనం రేపింది.

 

IHG


 అప్పటి నుంచి బ్రిఫ్డ్ మీ అనే పదం కూడా బాగా పాపులర్ అయింది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వాడివేడిగా జరుగనున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఫోన్ ట్యాపింగ్ ఆందోళన ఎక్కువగా కనిపిస్తోంది. ఈ మేరకు చంద్రబాబు తనయుడు నారా లోకేష్, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా తదితరులు ఫోన్ ట్యాపింగ్ పై అనుమానాలు వ్యక్తం చేశారు. టీడీపీ కీలక నాయకులతో పాటు ముఖ్యమైన నాయకులు అందరి ఫోన్ లు ట్యాప్ చేస్తున్నారని, ఎవరితో మాట్లాడుతున్నామో తెలుసుకుంటున్నారు అంటూ వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

 

IHG


దీంతో ఎవరితోనైనా ఫోన్ మాట్లాడాలి అంటే తెలుగుదేశం పార్టీ కీలక నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ నిజంగా వైసీపీ ప్రభుత్వం ఫోన్ ట్యాప్ చేస్తే తమ బండారం మొత్తం బయట పడుతుందని, తాను ఏం చేయబోతుతున్నాము అనే విషయం ముందుగానే వైసీపీకి తెలిసిపోతుందని, అందుకే ఫోన్లో మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని పార్టీ కీలక నాయకులు చాలామంది ఇప్పటికే చంద్రబాబు నుంచి సూచనలు అందినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: