రోజు ఆరంభలో భారీగా కుప్పకూలిన మార్కెట్ తర్వాత ఎవరి అంచనాలకి అందనంత భారీ లాభాలతో దూసుకెళ్లింది. దీనితో మార్కెట్ పతనానికి బ్రేకులు పడ్డాయని అనుప్కోవచ్చు. అనుకోకుండా ప్రభుత్వ రంగ బ్యాంక్‌ షేర్లలో భారీగా కొనుగోళ్ల జోరు కనిపించింది. ముఖ్యంగా ఇంట్రాడేలో సెన్సెక్స్ కనిష్ట స్థాయి నుంచి చూస్తే ఏకంగా 5,380 పాయింట్ల మేర ర్యాలీ జరిపింది. అలాగే నిఫ్టీ కూడా భారిగా అనగా 1,604 పాయింట్ల మేర లాభ పడింది. 

 

 


మొత్తానికి రెండు బెంచ్‌ మార్క్ ఇండెక్స్‌ లు 18%  పైగా లాభపడ్డాయి. ట్రేడ్ టైం ముగిసేసరికి సెన్సెక్స్ 1325 పాయింట్లు లాభం పొంది 34,103 వద్ద, నిఫ్టీ 365 పాయింట్లు లాభం పొంది 9,955 వద్ద ముగిసాయి. ఇకపోతే నేడు స్టాక్ ‌మార్కెట్ లోయర్ సర్క్యూట్‌ ను తాకింది. దీనితో 45 నిమిషాలపాటు ట్రేడింగ్ ని నిలిపివేశారు. ఇంకా  ఈరోజు ముఖ్యంగా చెప్పుకోవాలిసిన దానిలో నిఫ్టీ -50లో sbi, టాటా స్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ, బీపీసీఎల్, సన్ ఫార్మా షేర్లు లాభాల బాట పడ్డాయి. నిజానికి sbi 15 శాతం వరకు లాభపడింది.

 

 

ఇంకా నష్టాల విషయానికి వస్తే ముఖ్యంగా యూపీఎల్, జీ ఎంటర్‌టైన్‌మెంట్, నెస్లే ఇండియా, ఏసియన్ పెయింట్స్, బ్రిటానియా షేర్లు నష్టాలపాలయ్యాయి. ఇందులో యూపీఎల్ 7% వరకు పడిపోయింది. ఇక అమెరికా డాలర్‌ తో పోలిస్తే ఇండియన్ రూపాయి కాస్త రికవరీ బాట పట్టిందని చెప్పవచ్చు. మొత్తానికి 29 పైసలు లాభంతో 73.92 వద్ద పరిగెడుతుంది. ఇక అంతర్జాతీయ మార్కెట్‌ లో ముడి చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 5.36% పెరుగుదలతో 35 డాలర్లకు చేరింది. ఇంకా డబ్ల్యూటీఐ క్రూడ్ ధర బ్యారెల్‌కు 4.98% పెరుగుదలతో 33.06 డాలర్లకు పెరిగింది. దీనితో నేడు కాస్త నష్టాల నుంచి మదుపరులు బయట పడ్డారు అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: