స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఏపీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఎవ‌రు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో ?  ఏ పార్టీలోకి జంప్ చేస్తారో ?  ఏ పార్టీ నుంచి ఏ పార్టీలోకి వెళ‌తారో ?  అస‌లు ఏం జ‌రుగుతుందో అర్థంకాని ప‌రిస్థితి. ఇక అధికార వైసీపీకి గెలుపు అవ‌కాశాలు ఎక్కువుగా ఉండ‌డంతో పాటు అవ‌కాశాలు ఎక్కువుగా ఉండ‌డంతో పలువురు ఆశావాహులు ఆ పార్టీ నుంచి పోటీ చేసేందుకు పోటీలు ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే వైసీపీ నుంచి సీట్లు రాని వాళ్లు కొంద‌రు పార్టీ అధికారంలో ఉండ‌డంతో ఏదో ఒక ప‌ద‌వి వ‌స్తుంద‌ని స‌రిపెట్టుకుంటున్నారు.

 

మ‌రి కొంద‌రు అయితే వైసీపీని వీడి టీడీపీ లేదా బీజేపీ కండువా క‌ప్పుకుంటున్నారు. ఇక కీల‌క‌మైన అనంత‌పురం జిల్లాలో అధికారా పార్టీకి అదిరి పోయే ఎదురు దెబ్బ త‌గిలింది. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ గెలుపు కోసం ఎంతో క‌ష్ట‌ప‌డ్డ మాజీ కార్పొరేట‌ర్ కు ఈ ఎన్నిక‌ల్లో కార్పొరేట‌ర్ సీటు ఇవ్వ‌లేదు. దీంతో ఆమె వైసీపీని వీడారు. కీలక మహిళానేతగా ఉన్న జానకీ వైసీపీకి గుడ్ బై చెప్పేసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి సమక్షంలో జానకీ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

 

జానకీ.. 34వ డివిజన్‌ మాజీ కార్పొరేటర్‌. పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు ఆమె పార్టీ కోసం ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. కార్పొరేట‌ర్‌గా అప్ప‌టి టీడీపీ ప్ర‌భుత్వ విధానాల‌పై పోరాటం చేశారు. ఇక ఇప్పుడు పార్టీ అధికారంలోకి వ‌చ్చిన‌ప్పుడు ఆమెను ప‌క్క‌న పెట్టారు. ఇప్పుడు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లోనూ ఆమెకు సీటు ఇవ్వ‌లేదు. దీంతో అసంతృప్తికి లోనైన ఆమె వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. అయితే.. ఈమె చేరికతో ఎన్నికలకు ముందు నియోజకవర్గంలో వైసీపీకి ఎదురుదెబ్బేనని స్థానిక నేతలు చెబుతున్నారు. ఇక ఇదే జిల్లాలోని తాడిప‌త్రి, క‌దిరి, క‌ళ్యాణ దుర్గం నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఇదే ప‌రిస్థితులు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: