ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగింది. దీంతో అధికార మరియు ప్రతిపక్ష పార్టీలు లోకల్ బాడీ ఎలక్షన్ లో తమ సత్తా చాటడానికి ఒకరిని మించి మరొకరు వ్యూహాలు పన్నుతున్నారు. తెలుగుదేశం పార్టీ 2019 సార్వత్రిక ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోవడంతో ఈ ఎన్నికలలో భారీ స్థాయిలో విజయం సాధించి సత్తా చాటాలని వ్యూహాలు పన్నుతోంది. ఇటువంటి టైములో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నామినేషన్ ప్రక్రియ జరుగుతున్న తరుణంలో అధికార మరియు ప్రతిపక్ష పార్టీల మధ్య గొడవలు దాడులు ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. దీంతో ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదులు అందుతున్నాయి. అయితే దేశ వ్యాప్తంగా ఇటువంటి ఘటనలు ఎలక్షన్ టైం లో జరుగుతున్న తరుణంలో భారత ఎన్నికల సంఘం చెన్నై ఐఐటీతో విప్ల‌వాత్మ‌క మార్పున‌కు ప‌రిశోధ‌న చేస్తోంది.

 

విషయంలోకి వెళితే ఓటర్ ఎక్కడ ఉన్న తన ఓటు హక్కును వినియోగించుకునేలా ఆన్‌లైన్‌లో ఓటింగ్ ప్ర‌క్రియ‌పై ప‌రిశోధ‌న చేస్తున్న‌ట్టు ఇటీవ‌ల భార‌త ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించింది. నిజంగా ఇది కార్య‌రూపం దాలిస్తే మాత్రం అత్యున్న‌త భార‌త ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌లో ఓ గొప్ప మార్పున‌కు శ్రీ‌కారం చుట్టిన‌ట్టు అవుతుంది. గతంలో బ్యాలెట్ పద్ధతి ఉన్న తరుణంలో రిగ్గింగ్‌ జరుగుతున్న టైంలో...ఈవీఎంలను వాడుకలోకి తీసుకువచ్చి రిగ్గింగ్‌ అరికట్టారు. ఇప్పుడు తాజాగా ఆన్లైన్ ద్వారా ఓటింగ్ ప్రక్రియ తీసుకొస్తే గనుక కచ్చితంగా భారత ఎన్నికలలో  సరికొత్త మార్పు తీసుకు వచ్చినట్లు అని అంటున్నారు చాలామంది రాజకీయ సీనియర్ నేతలు.

 

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల వాతావరణం అలుముకున్న నేపథ్యంలో ఇటువంటి ప్రక్రియ ఏపీ నుంచి స్టార్ట్ అయితే జగన్ మరియు చంద్రబాబు చేస్తున్న రాజకీయాలు ఇరుక్కున్నట్లు అవుతుందని అంటున్నారు. అంతేకాకుండా నామినేషన్ల విషయంలో కూడా భారత ఎన్నికల సంఘం ఆన్లైన్ విధానం ద్వారా పత్రాలను స్వీకరిస్తే ఇంకా బాగుంటుందని సీనియర్ రాజకీయ నేతలు సూచిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: