ప్రపంచం వ్యాప్ంగా జనాలకు కరోనా భయం పట్టుకుంది.  ఎక్కడ చూసినా కరోనాకు సంబంధించిన వార్తలే వింటున్నారు. భారత దేశంలో ఇప్పటికీ 80 కేసులు నమోదు అయినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే  కర్ణాటకకు చెందిన 76 ఏళ్ల వృద్ధుడు చనిపోవడం.. తాజాగా మరో వ్యక్తికి కరోనా సోకడంతో ప్రభుత్వం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది.  తాజాగా కర్ణాటకలో మరో వ్యక్తికి కరోనా వైరస్ సోకింది. గూగుల్‌లో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌ తేలింది. దీంతో ఆ సంస్థ తమ ఉద్యోగులకు ఇవాళ్టి నుంచి వర్క్ ఫ్రమ్ హోం సదుపాయం కల్పించింది.   గ్రీస్‌ దేశం నుంచి ఓ యువకుడు 8న బెంగళూరుకు వచ్చాడు. ఈ యువకుడు ప్రయాణించిన ఆటో డ్రైవర్‌తో పాటు నలుగురు మిత్రులకు, ముగ్గురు కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు చేస్తున్నారు. మరో ఎనిమిది అనుమానితులను  ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. 

 

 

కరోనా ప్రబలకుండా ముందు జాగ్రత చర్యలుగా మాల్, థియేటర్, నైట్ క్లబ్, పబ్ బ్యాండ్ అన్నీ మూసేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది.  తాజాగా ఉత్తరప్రదేశ్ లో స్కూళ్లు, కాలేజీలు, ఇతర విద్యాసంస్థ లన్నింటినీ మరికొంత కాలం మూసే ఉంచుతామని ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు.  గత కొంత కాలంగా కరోనా బీభత్సం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎక్కువగా క్రౌడ్ ఉన్న ప్రదేశాల్లో ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు కొన్ని రాష్ట్రప్రభుత్వాలు.   ప్రస్తుతానికి ఈ నెల 22వ తేదీ వరకు మూసి ఉంచాలని నిర్ణయించామని, 22వ తేదీన పరిస్థితిని సమీక్షిస్తామని తెలిపారు. 

 

 

అవసరమైతే విద్యా సంస్థల మూసివేతను మరికొంత కాలం పొడిగిస్తామని చెప్పారు. ఇప్పటికే మొదలైన పరీక్షలను కొనసాగిస్తామని, ఇంకా మొదలుకాని పరీక్షలన్నింటినీ వాయిదా వేస్తున్నామని తెలిపారు. భారత దేశంలో కరోనా మహమ్మారిని ప్రారద్రోలే క్రమంలో ఎలాంటి చర్యలైనా తీసుకునేందుకు సిద్దమవుతున్నారు.  కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రాష్ట్రాలకు తగు సూచనలు పంపించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: