జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరిస్థితి ఆటలో అరటిపండులా అయిపోయింది. ఒక పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క రాజకీయాలు చేస్తున్నారు. 2019 ఎన్నికల ఓటమి తర్వాత నా కట్టె కాలే వరకు సినిమాలు చేయను ప్రజాస్వామ్యానికే నా జీవితం అంకితం అంటూ పెద్ద పెద్ద డైలాగులు వేసిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ స్టార్ హీరో చేతిలో లేని సినిమాలు ఉన్నాయి. దాదాపు మూడు పైగానే పవన్ కళ్యాణ్ సినిమాలు చేయబోతున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'పింక్' సినిమాని రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమా అయిన వెంటనే క్రిష్ దర్శకత్వంలో ఆ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమాలు చేయటానికి పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ప్రిపేర్ చేసుకున్నట్లు వార్తలు ఇండస్ట్రీలో వినబడుతున్నాయి.

 

ఇటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ మీడియా సమావేశంలో ఇటీవల మాట్లాడిన మాటలు పట్ల విమర్శలు వస్తున్నాయి. మేటర్ ఏమిటంటే జనసేన పార్టీ తరఫున మరియు బిజెపి పార్టీ తరఫున నామినేషన్లు వేసిన నాయకులు చాలా ధైర్యంగా ఉండాలని, దెబ్బ‌లు తిన్నా బ‌లంగా నిల‌బ‌డాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. దీంతో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు పై జనసేన పార్టీ కార్యకర్తలు మరియు పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో అసహనం చెందారు.

 

పార్టీ అధ్యక్షుడు అయి ఉండి ఎన్నికలు జరుగుతున్న టైములో సినిమా షూటింగులు ఏంటన్న...అంటూ కొంతమంది సోషల్ మీడియాలో పవన్ వ్యాఖ్యలపై సెటైర్లు వేస్తున్నారు . ప్రజా సమస్యల కోసమే జీవితం అన్నావు...ఇప్పుడు ఎండలో తిరిగితే నీ గ్లామర్ పోతుందని సినిమాలు చేస్తూ మమ్మల్ని రాజకీయాలు చేయమంటావా..? అంటూ మరికొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా సినిమాలు చూడడం కాస్త తగ్గించాలి మీరు...రియాల్టీ లోకి వచ్చి పార్టీని ముందుకు నడిపితే బాగుంటుందని సూచనలు ఇస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: