గుంటూరు జెడ్పీ పీఠం గెలవడానికి వైసీపీ-టీడీపీలు అదిరిపోయే వ్యూహాలతో ముందుకెళుతున్నాయి. జెడ్పీ చైర్‌ని ఎస్సీ మహిళకు రిజర్వ్ చేయడంతో, ఈ రెండు పార్టీలు స్ట్రాంగ్‌గా ఉన్న మహిళ అభ్యర్ధులని కీలకమైన స్థానాల్లో పోటీకి దింపుతున్నారు. ఈ జెడ్పీ పీఠం కోసం ఇటు వైసీపీలో, అటు టీడీపీలో ఇద్దరేసి మహిళా నేతలు పోటీ పడుతున్నారు. ఇక వీరిలో ఒకరికి జెడ్పీ పీఠం దక్కే అవకాశం కనిపిస్తోంది.

 

అయితే జెడ్పీ రేసులో ఉన్నవారు...తమ పార్టీలు బలంగా ఉన్న జెడ్‌పి‌టి‌సి స్థానాల్లోనే పోటీకి దిగుతున్నారు. వైసీపీ తరుపున చైర్‌పర్సన్ రేసులో హెన్రీ క్రిస్టినా, గోళ్ళ జ్యోతిలు ఉండగా, టీడీపీ నుంచి కూచిపూడి విజయ, నక్కల శైలజలు ఉన్నారు. ఇక వీరు జెడ్పీ రేసులో ఉన్నారు కాబట్టి, ఖచ్చితంగా గెలవాలి అందుకే తమ తమ పార్టీలు బలంగా ఉన్న మండలాల్లో బరిలో నిల్చున్నారు. హెన్రీ క్రిస్టినా 2014లో తాడికొండ నుంచి వైసీపీ తరుపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఈమెకు 2019 ఎన్నికల్లో టికెట్ దక్కలేదు. ఇక ఇప్పుడు జెడ్పీ పీఠం కోసం ప్రయత్నం చేస్తున్నారు.

 

కాగా, హెన్రీ తెనాలి నియోజకవర్గంలో వైసీపీ కంచుకోటగా ఉన్న కొల్లిపర నుంచి పోటీ చేస్తున్నారు. అటు గోళ్ళ జ్యోతి...ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి సపోర్ట్‌తో పెదకాకాని బరిలో ఉన్నారు. ఇక టీడీపీ జెడ్పీ రేసులో ముందున్న కూచిపూడి విజయ తాడికొండ జెడ్పీటీసీగా పోటీ చేస్తున్నారు. అలాగే మరో టీడీపీ అభ్యర్ధి నక్కల శైలజ...ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కాకమానులో పోటీ చేస్తున్నారు. 2014లో శైలజ టీడీపీ నుంచి కాకమాను ఎంపీపీగా గెలిచారు.

 

అయితే ఈ విధంగా మహిళా నేతలు సేఫ్ ప్లేస్‌లో జెడ్‌పి‌టి‌సిలుగా బరిలో దిగారు. కాకపోతే గుంటూరులో అత్యధిక జెడ్‌పి‌టి‌సి స్థానాలు అధికార వైసీపీ ఖాతాలోనే పడేలా ఉన్నాయి. కాబట్టి గుంటూరు జెడ్పీ పీఠంపై వైసీపీ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: