నివేదికల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఒక లక్షా 27 వేల మందికి కరోనా వైరస్ సోకగా... ఇండియాలో ఎనభై ఒక్క మందికి ఈ వైరస్ సంక్రమించింది. ప్రస్తుత పరిస్థితులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ కోవిడ్ 19 వ్యాధి బారిన పడుతున్న ప్రజల సంఖ్య గత కొన్ని రోజులుగా ఎక్కువగా పెరగడాన్ని నోటీసు చేసిన భారతదేశ ప్రభుత్వం... వీలైనన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. తాజాగా సుప్రీం కోర్టు కూడా కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఒక కీలక మైన నిర్ణయాన్ని తీసుకుంది.



ఈ సోమవారం అనగా మార్చి 16 నుండి కేవలం హై ప్రొఫైల్(అర్జెంటు) కేసులను తక్కువ మంది బెంచ్ లతో విచారించేలా సర్క్యులర్ జారీ చేసింది సుప్రీంకోర్టు. మరొక నోటీసు వచ్చేంత వరకు ఇలానే కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తాజా సుప్రీం కోర్టు నిర్ణయం ప్రకారం... కేసులను విచారించే లాయర్లు, కక్షిదారులు తప్ప మిగతా సామాన్య ప్రజలకు కోర్టు లో అడుగుపెట్టే అనుమతి లేదు. అలానే కోర్టు దరిదాపుల్లోకి రావడానికి న్యూస్ మీడియా కి కూడా అనుమతి లేదు.



ఉన్నత స్థాయి డాక్టర్ల సూచనలను పరిగణలోకి తీసుకొని లాయర్ల, కోర్టు సిబ్బంది, ఇంకా ఇతర ప్రజల యొక్క ఆరోగ్య శ్రేయస్సు కొరకు ఈ నిర్ణయాన్ని సుప్రీం కోర్టు తీసుకుంది. పబ్లిక్ లో కార్యక్రమాలు పెట్టకూడదని, పెద్ద సంఖ్యలో ప్రజలు గుంపులు ఏర్పడకూడదని ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం మార్చ్ 5వ తేదీన ఆదేశాలను జారీ చేసింది. సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ ఎస్. కల్గంకర్ ఈ నోటీసుపై సంతకం చేస్తూ వివరాలను వెల్లడించాడు. ఇప్పటికే చాలా రాష్ట్రాలు తమ పాఠశాలలను కరోనా వైరస్ కారణంగా మూసి వేయడం జరిగింది. అలాగే కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఏప్రిల్ 15 వ తారీఖు వరకు విదేశీయులను ఇండియాలోకి అల్లో చేసేందుకు మన ప్రభుత్వం తిరస్కరించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: