తెలంగాణ వస్తే ఇక్కడి ప్రజల బ్రతుకులు బాగుపడతాయని ప్రతి మనిషి కలలుకన్నాడు.. కలలు కనడం వేరు ఆ కలలను నిజం చేసుకోవడం వేరు.. అలాగే తెలంగాణ వచ్చాక తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పులు వస్తాయని ఆశించిన అక్క, అన్నలు అసలు విషయాన్ని గ్రహించడం లేదట.. తెలంగాణ వచ్చాక బాగుపడ్డవి ప్రజల బ్రతుకులు కావు నాయకుల బ్రతుకులని, ఈ గుడ్డి జనం తెలుసుకోలేక పోతున్నారని ప్రతిపక్షాలు గోల చేస్తున్నాయి.. ఓటును నోటుతో కొంటున్నంత కాలం. క్వాటర్ సీసాకు ఓటర్లు అమ్ముడు పోయినంత కాలం ఇలాగే మీ బ్రతుకులు ఉంటాయని మరికొందరు ఆవేదన పరులు అంటున్నారట..

 

 

ఇకపోతే ఎవరో వచ్చి బ్రతులు మారుస్తారని అనుకోవడం గాల్లో దీపం లాంటిది.. ఇకపోతే తెలంగాణ ప్రజలకు వాతలు పెట్టడానికి ప్రభుత్వం సిద్దమైందట.. 24 గంటలు కరెంటు అన్న కేసీయార్ ప్రభుత్వం కరెంటు చార్జీల పెంపుకు సిద్ధమైందట. ఈరోజు అసెంబ్లీ సమావేశంలో మాట్లాడిన కేసీఆర్ కరెంట్ చార్జీలు పెంచి తీరుతామన్నారు. గతంలోనే ఈ విషయంపై క్లారిటీ ఇచ్చిన ముఖ్యమంత్రి.. అప్పు చేసి కరెంటు తెస్తున్నాం చార్జీలను పెంచక తప్పదని తెలిపారు. నేడు ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకున్నారు. ఇదే కాకుండా పంచాయతీ రాజ్ చట్టాలను కఠినంగా అమలు చేస్తామని పేర్కొన్నారు. లేఅవుట్లు కేటాయించే అధికారం కేవలం కలెక్టర్లకు మాత్రమే ఉంటుందని స్పష్టం చేసారు. ఇక ఈ విద్యుత్ చార్జీలు, ఆస్తిపన్న పెంపు విషయంలో జోక్యం చేసుకున్న టీపీసీసీ కోశాధికారి గుడూరు నారాయణరెడ్డి, దీన్ని తీవ్రంగా ఖండించారు.

 

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మొదటి నుంచి రాష్ట్ర ఆర్ధికవ్యవస్థను కేసీఆర్ ప్రభుత్వం అస్తవ్యస్తంగా నిర్వహిస్తోందని, బడ్జెట్ అంచనాలకు వాస్తవ ఆదాయాల మధ్య భారీ వ్యత్యాసం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. విచక్షణారహితంగా అప్పులు తీసుకుని రాష్ట్రాన్ని భారీ అప్పుల్లోకి నెట్టివేయడమే కాకుండా, కేసీయార్‌ను నమ్మి పదవి కట్టబెట్టిన తెలంగాణ ప్రజల బ్రతుకులను రానున్న కాలంలో అంగట్లో బొమ్మలా నిలపెట్టి అమ్మేస్తాడని మండిపడ్డారు. ప్రజలకు భారం కాకుండా దిద్దుబాటు చర్యలు తీసుకోకుండా ఆర్థిక మాంద్యంలో కూడా రూ. 1.82 లక్షల కోట్ల అవాస్తవ బడ్జెట్‌ ప్రవేశపెట్టడం ఏంటని ప్రశ్నించారు. ఇక ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చడానికి ఈ ప్రభుత్వం సామాన్యులపై భారం మోపుతోందని విమర్శించారు. .

 

 

ఈయన పాలన ఇలాగే సాగితే రానున్న కాలంలో తెలంగాణ ప్రజలందరు బిచ్చగాళ్లలా మారవలసి వస్తుందని. అందుకు నిదర్శనమే పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఎప్పటికప్పుడు పెరుగుతున్న ఇంధన ధరలు. ఇక ఆర్థిక మాంద్యం కారణంగా… రాబడులు తగ్గడంతోపాటు, ఉద్యోగాలు ఊడతాయని నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. అంతే కాకుండా ఇంధనంపై అధిక పన్నులు, సర్‌చార్జీలు వసూలు చేస్తున్న రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి అని ఆయన ధ్వజమెత్తారు.

 

 

తెలంగాణ ఆర్టీసీని భ్రష్టు పట్టించి.. కిలోమీటరుకు 20 పైసలు లెక్కన ఆర్టీసీ చార్జీలు పెంచి సామాన్యులకు భారం కలిగించిన కేసీఆర్ ప్రభుత్వం... తాజాగా విద్యుత్ ఛార్జ్ లు పెంచడం వాణిజ్య, పరిశ్రమ రంగాలను దెబ్బతీస్తోందని మండిపడ్డారు. అందుకే ఈ ప్రభుత్వం తక్షణమే తన నిర్ణయాన్ని సమీక్షించి, సామాన్యులపై అదనపు భారం పడకుండా వృద్ధిని సాధించే వాస్తవిక విధానాన్ని అవలంబించాలని గూడురు నారాయణరెడ్డి డిమాండ్ చేశారు.. ఇక ఈ విషయాల్లో నిజ నిజాలను పాలకులే గుర్తించాలి, ప్రజలు గమనించాలని అనుకుంటున్నారు కొందరు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: