స్థానిక సంస్థల ఎన్నికల ముందు టీడీపీ నేతలు చంద్రబాబుకు వరుస షాకులిస్తున్నారు. టీడీపీ నుండి వైసీపీలో రోజుకో ముఖ్య నేత చేరుతున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టీడీపీ నుండి వైసీపీలో చేరుతున్న వలసల గురించి మాట్లాడుతూ మరో పది మంది ఎమ్మెల్యేలు టీడీపీని వీడి వైసీపీలో చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏ మాత్రం లేదని అన్నారు. మంత్రి చేసిన వ్యాఖ్యలు టీడీపీ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. 
 
సీనియర్ ఎన్టీయార్ సినిమాల్లో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటే చంద్రబాబు రాజకీయాల్లో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు. చంద్రబాబు గవర్నర్ తో మాట్లాడిన తీరు చుస్తే ఆయనలో నంది, ఆస్కార్ స్థాయి నటన కనపడుతోందని చెప్పారు. టీడీపీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి నెలకొందని అన్నారు. సీఎం జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేశాడని అది ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. 
 
2019 ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయని వాళ్లు సైతం వైసీపీకి ఆకర్షితులయ్యారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చాలామంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇప్పటికే టీడీపీని వీడారని వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తన కొడుకు నారా లోకేశ్ ను రాజ్యసభకు ఎందుకు నిలబెట్టడం లేదో చెప్పాలని అన్నారు. గతంలో మోదీని విమర్శించిన చంద్రబాబు ఇప్పుడు కాళ్లబేరానికి వచ్చాడని చెప్పారు. 
 
మీడియాలో కనపడకుండా చంద్రబాబు ఉండలేరని విమర్శలు చేశారు. చంద్రబాబుకు వైసీపీ చేస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న పథకాలు కనపడటం లేదని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల వల్ల లబ్ధి పొందినవారు వైసీపీనే గెలిపిస్తారని చెప్పారు. ఉగాదికి ఇళ్ల పట్టాల పంపిణీకు ఈసీ అనుమతి ఇస్తుందని తాము భావిస్తున్నామని చెప్పారు. చంద్రబాబు దారి చూపినా ముందుకు పోలేని పరిస్థితులలో లోకేశ్ ఉన్నాడని విమర్శలు చేశారు.      

మరింత సమాచారం తెలుసుకోండి: