తెలంగాణ రాజకీయాలలో టిఆర్ఎస్ పార్టీ నాయకురాలు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అతి తక్కువ టైమ్ లోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా రాణించిన కవిత...టిఆర్ఎస్ పార్టీలో కీలక పాత్ర పోషించారు. పొలిటికల్ గా తండ్రి కెసిఆర్ కి మరియు అదే విధంగా అన్నయ్య కేటీఆర్ కి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ సక్సెస్ఫుల్ పొలిటీషియన్ గా ఆమె రాణించడం జరిగింది. గతంలో నిజామాబాద్ ఎంపీ గా పనిచేస్తున్న సమయంలో ఉత్తమ పార్లమెంటేరియన్ గా కవిత ఎంపిక అవటం జరిగింది. అటువంటి టైమ్ లో గత సార్వత్రిక ఎన్నికల సమయంలో నిజామాబాద్ నుండి మళ్లీ పార్లమెంటుకు పోటీ చేయగా ఓడిపోవడం జరిగింది. అటువంటి టైమ్ లో ఆమె స్థానంలో బిజెపి గెలవడంతో...ఆ పార్టీ నాయకులు టిఆర్ఎస్ పార్టీపై రెచ్చిపోయారు.

 

ఇలాంటి సమయంలో కవిత సైలెంట్ అయిపోయారు. ఇటువంటి పరిస్థితుల్లో కవిత మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ అవుతున్నట్లు టిఆర్ఎస్ పార్టీ నుండి రాజ్యసభకు వెళ్తున్నట్లు ఇటీవల ప్రచారం జరిగింది. రాజకీయంగా ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఎదుర్కోగలిగే కవిత తనపై వచ్చిన వార్తలను కొట్టి పారేసింది. అదే టైంలో కెసిఆర్ కూడా వేరే వ్యక్తులను రాజ్యసభకు పంపించడం జరిగింది. గతంలో కూడా కవితా సైలెంటుగా ఉన్న టైంలో కెసిఆర్ ఆమెను మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు వార్తలు రావడం మనకందరికీ తెలిసినదే. అయితే వాటిలో వాస్తవం లేదని తర్వాత తేలిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో కవిత తిరుగులేని వేగంతో మళ్లీ పుంజుకుంటుంది అన్న వార్తలు ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ వర్గాలలో బలంగా వినబడుతున్నాయి.

 

పూర్తి మేటర్ లోకి వెళ్తే ఇలా అడ్డదారుల్లో కాకుండా నేరుగా మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసి ప్రజాస్వామ్య పదవి చేపడతానని అప్పటి దాక ప్రజల మధ్య ఉంటాను అని ఇటీవల కెసిఆర్ కి కవిత చెప్పిందట. సరైన నిర్ణయం తీసుకున్న కవిత అని కెసిఆర్ కూడా అభినందించారు. నాలుగు సంవత్సరాలు పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు, నష్టం ఏమీ లేదని  ఇమేజ్ మరింతగా పెంచుకునే అవకాశం ఉంటుందని కెసిఆర్ కూడా ఆమెకు సూచనలు చేసినట్టు సమాచారం. దీనికి కవిత కూడా ఓకే చెప్పడంతో కవిత ప్రస్తుతం తెలంగాణలో ప్రజా సమస్యలపై దృష్టి పెట్టినట్లు సరైన స్కెచ్ వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: