టీడీపీలో తిరుగులేని నాయకుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి, ఆ పార్టీ తెలంగాణాలో పూర్తిగా పతనమైన తర్వాత..కాంగ్రెస్‌లోకి వెళ్లాడు.. ఇక కాంగ్రెస్‌లో ఉండి చక్రం తిప్పుతారనుకుంటే, ఆ పార్టీ వాళ్లే రేవంత్‌ను తొక్కేస్తున్నారనే టాక్ భయట వినిపిస్తుందట.. ఇక ఇదంతా ఒకెత్తైతే  పీసీసీ అధ్యక్షునిగా రేవంత్‌ను నియమించడం ఖాయం అని జోరుగా ప్రచారం జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీలో నుండి చాలమంది ఈ అధ్యక్షపదవికి తెరమీదికి వచ్చారు.. ఈ సందర్భంలో కాంగ్రెస్‌కు బాహుబ‌లి అవుతాడ‌ని భావించిన రేవంత్ ఇప్పుడు అంత‌ర్గ‌త రాజ‌కీయాల‌కు బ‌లిప‌శువుగా మారాడ‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తుంది.

 

 

ఫైర్‌బ్రాండ్‌గా ఎదిగిన ఎంపీ రేవంత్ రెడ్డి చుట్టూ ప్రస్తుతం ఉచ్చు బిగిస్తుందట.. అతని చుట్టు అక్రమ భూముల వ్యవహారం అనే సంకెళ్లను తగిలించి రేవంత్ రాజకీయ జీవితానికి శుభం కార్డు పలకాలని కొందరు నాయకులు భావిస్తున్నారనే సందేహం చాలా మందికి కలుగుతుందట.. ఇకపోతే ఎప్పుడో ప‌దేళ్ల కింద‌ట కొన్న భూములు.. అది కూడా ఆయ‌నొక్క‌డే కాదు.. కాంగ్రెస్‌, టీడీపీ, భాజ‌పా, టీఆర్ ఎస్‌లోనూ చాలామంది ఖ‌ద్ద‌రు నేత‌లున్నారు. పైగా 2014 నుంచి టీఆర్ఎస్ అధికారంలో ఉందన్న విషయం తెలిసిందే.. మరి ఇలాంటి సమయంలోనే రేవంత్‌ను క‌ట్ట‌డి చేసేందుకు అక్ర‌మాల చిట్టా బ‌య‌ట‌కు తీయ‌వ‌చ్చు. కానీ.. ఇన్నేళ్లు ఆగి.. ఇప్పుడు కావాల‌ని తీగ‌లాగ‌టం వెనుక‌.. ఎంత పెద్ద కుట్రజరుగుతుందనేది తెలుస్తుందట..

 

 

ఇకపోతే రేవంత్ కు జ‌నంలో ముఖ్యంగా మాస్ లో కేసీఆర్‌ను ఎదిరించ‌గ‌ల స‌మ‌ర్థుడు  అనే పేరు ఉంది. అందువల్లే ఆయ‌న కొడంగ‌ల్ లో ఓడినా.. మ‌ల్కాజ‌గిరిలో ఎంపీగా గెలిచాడు. కానీ ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ అంత‌ర్గ‌త రాజ‌కీయాలతో ఒంట‌రిగామార‌ట‌మే కాదు. చివ‌ర‌కు ఆయ‌న రాజ‌కీయ జీవితంపై నీలినీడ‌లు అలుముకుంటున్నాయి. ఈ పరిస్దితులన్ని ఇలాగే దాడిచేస్తుంటే ఏదో ఒకరోజు విసిగిన రేవంత్ కాంగ్రెస్ పార్టీను వీడినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు. అదే జ‌రిగితే.. త‌రువాత ఆప్ష‌న్ బీజేపీలోకి చేర‌ట‌మే అనే ప్ర‌చారం వినిపిస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: