ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల నగారా మోగిన విషయం తెలిసిందే. ఇంకొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఆంధ్ర రాజకీయాలు వేడెక్కాయి. మామూలుగానే అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో విమర్శలు జరుగుతూ ఉంటాయి.. ఇక ఎన్నికల సమయం కావడంతో ఆంధ్ర రాజకీయాల్లో విమర్శలు ప్రతివిమర్శలు మరింత వాడివేడిగా జరుగుతోన్నాయి . ఇక ప్రతిపక్ష టీడీపీ అధికార వైసీపీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. అభ్యర్థులను కనీసం ఎన్నికల్లో కనీసం పోటీ కూడా చెయ్యనివ్వటం లేదని దాడులకు పాల్పడుతున్నారు ఆరోపిస్తున్నారు. ఇక తాజాగా దీనిపై టిడిపి అధినేత ప్రతిపక్షనేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికార వైసీపీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 

 

 

 

 స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపి పార్టీ అభ్యర్థులకు వైసీపీ పార్టీ అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు చంద్రబాబు. తాజాగా మంగళగిరి లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు... రాష్ట్రంలో ఇంత దారుణం జరుగుతున్నప్పటికీ ముఖ్యమంత్రి జగన్ గాని హోంమంత్రి సుచరిత గాని కనీసం ఎన్నికల సంఘం కానీ పట్టించుకోవడం లేదు అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైసిపి నేతలు  మహిళలపై వ్యవహరిస్తున్న తీరు ఆంధ్రప్రదేశ్లో ఆడబిడ్డలకు రక్షణ ఉందా అని అనిపిస్తుంది అంటూ చంద్రబాబు అన్నారు. దిశ చట్టం కింద సీఎం జగన్మోహన్ రెడ్డితోపాటు పంచాయతీరాజ్ మంత్రి పెద్దిరెడ్డి పై కేసులు పెడితే గాని వారికి బుద్ధి రాదు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. 

 

 

 

 వైసీపీ సర్కార్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని అంటూ ఆరోపించిన చంద్రబాబు... ప్రత్యర్థుల ఇళ్ళల్లో మందు బాటిల్స్ పెడుతున్నారు అంటూ ఆరోపించారు. ఈ క్రమంలోనే తెనాలిలో నాలుగవ  వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్న అడుసుమిల్లి  వెంకటేశ్వర రావు ఇంటి  గోడదూకి వైసిపి వర్గీయులు  మందు బాటిల్స్ పెట్టారు అంటూ ఆరోపించారు చంద్రబాబు నాయుడు. అంతేకాకుండా తిరుపతి లో కూడా టిడిపి నేత కామేష్ యాదవ్ ఇంట్లో మద్యం సీసాలు ఉన్నాయని అనవసర రాద్ధాంతం చేశారు అంటూ మండిపడ్డారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని వైసీపీ నేతలు అందరూ మహిళలని కూడా చూడకుండా అరాచకాలకు పాల్పడుతున్నారని ఆరోపించిన చంద్రబాబు... పుంగనూరులో నామినేషన్ వేసేందుకు ఎవరికి తెలియకుండా బురఖా ధరించి వెళ్లిన  అడ్డుకున్నారు అంటూ మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: