కరోనా.. ఇప్పుడు సామాన్యులనే కాదు ప్రముఖులను కూడా వణికించేస్తోంది. రోగానికి రాజు పేద అనే బేధం ఉండదని మరోసారి రుజువు చేస్తోంది. ప్రపంచంలో ఇప్పుడు అనేక మంది సెలబ్రెటీలు ఈ రోగం బారిన పడుతున్నారు. తాజాగా.. బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బోల్సోనారోకు కూడా కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆ దేశం ధ్రువీకరించింది. ఇప్పటికే

కెనడా ప్రధాని భార్య తాజాగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భార్య సోఫీ గ్రెగరీ ట్రూడో‌కు కరోనావైరస్ సోకినట్లు నిర్ధరణైంది. ఈ మేరకు ఆ దేశ ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

 

 

కెనడా ప్రధాని భార్యకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో 14 రోజుల పాటు విడిగా ఉంచుతున్నారు. సోఫీకి కరోనా సోకినట్లు నిర్ధరణ కావడంతో భర్త జస్టిన్ ట్రూడోను కూడా 14 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉంచుతున్నారు. ఇక ఇప్పుడు బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్స్‌నారో కు కూడా కోవిడ్ 19 పాజిటివ్ అని తేలింది. ఇటీవల బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్స్‌నారోకు కరోనావైరస్ పరీక్షలు జరిపారు. ఎందుకంటే.. బ్రెజిల్ కమ్యూనికేషన్స్ సెక్రటరీకి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధరణ అయ్యింది.

 

 

అందువల్ల అధ్యక్షుడికీ పరీక్షలు జరిపారు. అధ్యక్షుడి కమ్యూనికేషన్ సెక్రటరీ అమెరికా పర్యటన నుంచి వచ్చిన తరువాత కరోనా ఉన్నట్లు తేలింది. విచిత్రం ఏంటంటే... కొన్ని రోజుల క్రితం.. బ్రెజిల్ అధ్యక్షుడు బోల్స్‌నారో కరోనావైరస్‌ను ఒక భ్రమగా కొట్టిపారేశారు. విధి విచిత్రం అంటే ఇదే కావచ్చు.. ఇప్పుడు ఆయనే పరీక్షలు చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంతే కాదు.. ఏకంగా కరోనా బారిన పడి ఐసోలేషన్ లో ఉండి చికిత్స చేయించుకోవాల్సి వస్తోంది.

 

 

ఇప్పటి వరకూ ఓ దేశ అధ్యక్షుడి స్థాయి వ్యక్తికి కరోనా రావడం ఇదే ప్రధమం. ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటంటే.. బ్రెజిల్ కమ్యూనికషన్స్ సెక్రటరీ అమెరికావెళ్లి చర్చలు జరిపింది ట్రంప్ తోనే.. మరి ఇప్పుడు ఈ వ్యాధి ట్రంప్ కు కూడా వచ్చే అవకాశాలు లేకపోలేదంటున్నారు. అదే జరిగితే.. ఇంకేమైనా ఉందా..?

 

మరింత సమాచారం తెలుసుకోండి: