ప్రస్తుతం ఏపీలో లోకల్ బాడీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ భారీ విజయం సాధించడం ఖాయమని సంకేతాలు ఉన్నాయి. ఈ ఎన్నికల తరువాత జగన్ అటు పాలనాపరంగా, ఇటు రాజకీయంగా భారీ దూకుడు ప్రదర్శిస్తారని అంటున్నారు. 

 

అమరావతిని శాసన రాజధాని చేస్తామని చెప్పిన జగన్ ప్రస్తుతం అక్కడ ఉన్న అసెంబ్లీని ఆసుపత్రిగా మార్చబోతారని టాక్.  దానికి బదులుగా గుంటూర్లో జాతీయ రహదారి వద్ద కొత్తగా అసెంబ్లీ కాంప్లెక్స్ ని నిర్మాణం చేయడానికి కూడా జగన్ సర్కార్ ఆలోచనలు చేస్తోందని అంటున్నారు. అలాగే నాగార్జున యూనివర్శిటీకి సచివాలయం అప్పగించి ఇపుడు ఉంటున్న వర్శిటీ క్యాంపస్ ని తీసుకుని ప్రభుత్వం అభివ్రుధ్ధి పనుల కోసం వాడుకోవాలన్నది కూడా జగన్  మదిలో మెదిలే ఆలోచనలుగా చెబుతున్నారు. 

 

అమరావతిలో భవనాలను ఏంచేయాలన్న దాని మీద ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారని అంటున్నారు. ఆయన మదిలో అమరావతి ఓ అద్భుతమైన హెల్త్ సిటీగా రూపుదిద్దుకోవాలని ఉందిట. అమరావతిలోని అసెంబ్లీ, ఇతర కీలకమైన భవనాలను ఎంపిక చేసి అక్కడ పేదల కోసం మంచి ఆసుపత్రికి ఇవ్వలన్నది జగన్ ఆలోచనగా చెబుతున్నారు. అదే విధంగా అమరావతిలోని సచివాలయం విషయంలోనూ జగన్ కొత్త ఆలోచనలు చేస్తున్నారు.

 


అమరావతిని ఎడ్యుకేషనల్ హబ్ గా చేస్తామని వైసీపీ సర్కార్ ఈ సరికే ప్రకటించింది. దాంతో నాగార్జున యూనివర్శిటీకి సచివాలయం మొత్తం అప్పగించాలని జగన్ పెద్ద ప్లాన్ వేస్తున్నారుట. అలాగే వివిధ డిపార్టుమెంట్లను బ్లాకులుగా చేయాలని కూడా జగన్ డిసైడ్ అయ్యారట. ఇక నిర్మాణంలో ఉన్న జడ్జిల నివాసాలు, మంత్రుల క్వార్టర్లు కూడా వైస్ చాన్సలర్ నివాసాలుగా మార్పు చేయాలన్నది కూడా జగన్ మరో ఆలోచన‌గా  ఉందిట.

 


టీడీపీ సర్కార్ ఉన్నపుడు అమరావతి ఈ పేరు చంద్రబాబు నోట పదే పదే పలికేది.  ఇపుడు ఆ చరిత్ర కరిగిపోతోంది. అమరావతి ఆనవాళ్ళు ఒక్కోటిగా తొలగిపోనున్నాయి. బహుశా గట్టిగా అమరావతి పేరుని 2020 సంవత్సరం అంతం వరకూ చెప్పుకుంటామేమో. ఆ తరువాత అమరావతి అన్న పేరు రాయడానికి కూడా మీడియాలో అవకాశం ఉండదు. ఎందుకంటే రాజధానే కాదు అన్నీ కూడా  అక్కడ నుంచి పూర్తిగా షిఫ్ట్ అవుతాయి కాబట్టి. మొత్తం మీద చూసుకుంటే 2020 ముగిసేసరికి అమరావతి చరిత్రలోకి వెళ్ళిపోతుందని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: