ఏపీ సీఎం జగన్ కు ఉన్న బలం.. ఆయన తండ్రి వారసత్వమే. అందుకే ఆ వారసత్వాన్ని ఏమాత్రం తేడా రాకుండా జగన్ కాపాడుకుంటున్నారు. వారసత్వం అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకునే వారసత్వం.. అందుకే లేని గొప్పలు చెప్పుకోకుండా... ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు జగన్. ఒక్కో సంక్షేమ పథకాన్ని అమలులోకి తెస్తూ.. తక్కువ సమయంలోనే మేనిఫెస్టోలోని చాలా కార్యక్రమాలును పట్టాలెక్కించేశారు.

 

 

ఆ క్రమంలో ఆయన కొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. తాజాగా.. రికార్డు స్థాయిలో అర్హులైన వారందరికీ పెన్షన్లు అందజేశారు. ఇవ్వడం అంటే అలా ఇలా కాదు.. ఒకటో తారీషు ఉదయం ఆరుగంటల కల్లా పెన్షన్లు నిరుపేదల ఇళ్లను పలకరించాయ్.. కేవలం రెండు రోజుల్లోనే గ్రామ వాలంటీర్ల ద్వారా 95 శాతం పెన్షన్ల పంపిణీ జరిగిపోయింది. ఈ విషయాన్ని మీడియాకు వివరించిన పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇదో అరుదైన రికార్డుగా చెప్పారు.

 

 

తన రాజకీయ అనుభవంలో వైయస్‌ జగన్‌ లాంటి ముఖ్యమంత్రిని చూడలేదని, మూడు రోజుల్లోనే పెన్షన్లు ఇంటింటికీ డోర్‌ డెలవరీ చేయించారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి ఇలా పెన్షన్లు అందించలేదన్నారు. 3వ తేదీ వరకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ మొత్తం కలిపి 94.44 శాతం అంటే 50,50,194 మందికి పెన్షన్లు అందజేశామన్నారు. మిగిలిన వారికి రెండ్రోజుల్లో అందజేస్తామన్నారు.

 

 

ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే.. గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకున్న 5 రోజుల్లోనే మంజూరు చేస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. పెన్షన్‌కు అర్హులైన వారంతా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ అర్హత మేరకు పెన్షన్‌ 5 రోజుల్లో మంజూరు చేయడం జరుగుతుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన వారికి పెన్షన్‌ ఇస్తాం. గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: