ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కంటే.. జగన్ వైరస్ మహా డేంజర్ అంటున్నారు ప్రతిపక్షనేత చంద్రబాబు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని చంద్రబాబు ఆరోపించారు. వైసిపి నేతలు కండకావరంతో ప్రవర్తిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. తెనాలిలో టీడీపీ నేత ఇంటి గోడ దూకివెళ్లి మద్యం పెట్టి.. ఆ తర్వాత తప్పుడు కేసులు పెట్టి వేధించేందుకు ప్రయత్నించారని చంద్రబాబు మండిపడ్డారు.

 

 

రాత్రి టీడీపీ నేత ఇంట్లోని వాటర్ ట్యాంకు కింద మద్యం బాటిళ్లు పెట్టి.. తర్వాతి రోజు పోలీసులు ఆ నేత ఇంటికి వెళ్లి వాటర్ ట్యాంక్ ఎక్కడని ప్రశ్నించారని.. అలా ఎందుకు అడిగారని చంద్రబాబు అన్నారు. అంతే కాదు.. ఈ అంశంపై నిలదీసిన మాజీ మంత్రి ఆలపాటి రాజాను పోలీస్ స్టేషన్ లో ఎందుకు పెట్టారని చంద్రబాబు ప్రశ్నించారు. తెలంగాణ నుంచి ఇష్టారాజ్యంగా మద్యం తీసుకొస్తున్నారని ఆరోపించారు. కరోనా వైరస్ కన్నా జగన్ వైరస్ ప్రమాదమని చంద్రబాబు మండిపడ్డారు.

 

IHG

 

ఆయన ఇంకా ఏమన్నారంటే.. ” వైసీపీ నేతలు.. మహిళలపైనా అరాచకాలకు పాల్పడుతున్నారు.. చిత్తూరు జిల్లా పుంగనూరులో నామినేషన్‌ వేసేందుకు వెళ్లిన మహిళను అడ్డుకున్నారు. బురఖా వేసుకొని వెళ్లినా గుర్తుపట్టి అడ్డగించారు. దుస్తుల్లో దాచుకున్న నామినేషన్ దారుణంగా లాక్కునేందుకు ప్రయత్నించారు. ధర్మవరంలో మహిళ నామినేషన్‌ పత్రాలను లాక్కున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

 

ఈ ఘటనపై దిశ చట్టం కింద మొదట సీఎం జగన్‌, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిపై కేసు పెట్టాలి. తెదేపా అభిమాని పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసుల ముందే వైకాపా నేతలు అరాచకాలు చేస్తున్నారు. ఇన్ని జరుగుతున్నా సీఎం, హోంమంత్రి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి పట్టదా?’ అని చంద్రబాబు మండిపడ్డారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: