టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రాజకీయ వారసుడు మాజీ మంత్రి  నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నోసార్లు ట్విట్టర్ వేదికగా స్పందించిన మాజీ మంత్రి నారా లోకేష్ ఎన్నోసార్లు జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. ఇక తాజాగా మరోసారి ట్విట్టర్ వేదికగా జగన్ సర్కార్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు నారా లోకేష్. వ్యవస్థల్ని భ్రష్టు పట్టించడం లో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు నెంబర్ వన్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి నారా లోకేష్. 

 


 గతంలో తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు... వైయస్ జగన్మోహన్ రెడ్డి తప్పుడు పనులు చేసి ఐఏఎస్ అధికారులను జైలుకు పంపారు అంటూ విమర్శలు చేసిన మాజీ మంత్రి నారా లోకేష్... ఇప్పుడు ఐపీఎస్ అధికారులను కోర్టు మెట్లు ఎక్కించి చివాట్లు  పెట్టిస్తున్నారు అంటూ విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియాలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రశ్నిస్తున్నందుకు.. టిడిపి కార్యకర్తని ఏకంగా 14 రోజుల పాటు రిమాండ్ కు పంపారు అంటూ విమర్శించారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో... టిడిపి నేతలపై నడిరోడ్డు మీద హత్యా యత్నం చేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని మాత్రం... స్టేషన్ బెయిలు ఇచ్చా మంటూ ఒకసారి.. తూచ్ అతను పారిపోయాడు అని మరోసారి మాయ మాటలు చెబుతారా అంటూ ప్రశ్నించారు. 

 

 

 ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ రాష్ట్రంలో ఎంతో బాధ్యతగా మెలగాల్సిన పోలీసు వ్యవస్థ ని ఇంత నిస్సిగ్గుగా దుర్వినియోగం చేస్తున్నారు కాబట్టి.. రాష్ట్రంలో అసలు చట్టాలు అమలు అవుతున్నాయ అని కోర్టులు సైతం ప్రశ్నించే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో వచ్చింది అంటూ విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి నారా లోకేష్. పోలీస్ వ్యవస్థను దుర్వినియోగానికి పాల్పడుతూ ఎన్నో అక్రమాలకు పాల్పడుతున్నారు అంటూ విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి నారా లోకేష్.

మరింత సమాచారం తెలుసుకోండి: