చూస్తూనే ఉండండి టీవీ9.. ఇది టీవీ9 యాంకర్ సైనాఫ్ డైలాగ్.. ఏదైనా వార్త చెప్పేసి బ్రేక్ తీసుకునే ఉంది ఈ మాట చెబుతారు టీవీ9 యాంకర్లు.. ఇక ఇప్పుడు చూస్తూనే ఉండండి.. టీవీ సీబీఎన్ అని చెప్పుకోవాల్సిన రోజులు వచ్చేశాయి.. అదేంటి ఈ టీవీ సీబీఎన్ ఎక్కడిది అనుకుంటున్నారా.. లేకపోతే.. కొంపదీసి చంద్రబాబు కొత్త చానల్ కానీ తీసుకొస్తున్నారా అన్న అనుమానం కలిగిందా.. ?

 

 

అబ్బే అదేమీ లేదు లెండి.. ఆయనకు కొత్తగా ఛానల్ పెట్టే ఆలోచనలేమీ కనిపించడంలేదు. అయినా ప్రధాన మీడియాలోని బలమైన ఛానళ్లు ఆయనకే అనుకూలంగా కథనాలు ఇచ్చేటప్పుడు.. మళ్లీ సొంత మీడియా ఎందుకు.. సొంత మీడియా ఉన్నా వాటిని జనం విశ్వసించడం చాలా కష్టం. మరి అలాంటప్పుడు ఈ టీవీ సీబీఎన్ ఏంటంటారా.. దీని గురించి చెప్పాలంటే..మిమ్మలన్ని ఓ ప్రశ్న అడగాలి. ఇటీవల మీరు చంద్రబాబు ప్రెస్ మీట్లు గమనిస్తున్నారా.. అదేంటి ఆయన ప్రెస్ మీట్ మొదలవగానే ఛానల్ మార్చేస్తారా.. ఆయన ఎంత సుదీర్ఘంగా మాట్లాడితే మాత్రం.. అలా ఛానల్ మార్చేస్తారా..

 

 

అది సరే కానీ.. చంద్రబాబు కూడా తన ప్రసంగాలు బోరు కొడుతున్నాయని ఫీలవుతున్నారో.. లేక.. టెక్నాలజీని బాగా వాడుకోవాలని డిసైడ్ అయ్యారో తెలియదు కానీ.. ఇటీవల ఆయన ప్రెస్ మీట్లు మొత్తం టీవీ ప్రజంటేషన్లే ఉంటున్నాయి. ఆయన ఓ విషయం గురించి మాట్లాడతారు.. వెంటనే పక్కన ఉన్న పెద్ద టీవీ స్క్రీన్ మీద దాని తాలూకూ క్లిప్పింగ్ ప్లే కావడం ప్రారంభమవుతుంది.

 

 

ఇక చంద్రబాబు ఆ వీడియో క్లిప్ గురించి వివరిస్తారు.. అంతే కాదు.. ఈ వీడియో క్లిప్పింగులు సాధారణంగా ఉండవు.. మామూలు టీవీ ఛానల్లో ప్లే చేసే లెవల్లో గ్రాఫిక్స్, హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్ అన్నీ ఉంటాయి. అంటే ఓ టీవీ ఛానల్లో న్యూస్ బులెటిన్ చేసేందుకు ఎంత కసరత్తు చేస్తారో.. ఇప్పుడు పాపం టీడీపీ మీడియా సెల్ వారు.. అంత కసరత్తు చేస్తున్నారు. ఇక చంద్రబాబు కూడా ఏ టీవీ యాంకర్ కూ తీసిపోకుండా.. వార్తలు ప్రజెంట్ చేస్తున్నారు.. అందుకే అంటున్నాం.. చూస్తూనే ఉండండి టీవీ సీబీఎన్..? ఏమంటారు..?

 

మరింత సమాచారం తెలుసుకోండి: