టీడీపీ అధ్యక్షుడు ఎవరంటే ఎవరైనా ఏం చెబుతారు.. చంద్రబాబు అనే చెబుతారు. కానీ.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అని ప్రత్యకంగా మెన్షనే చేస్తే తప్ప.. కళా వెంకట్రావు అనే ఒక నాయుకుడు ఉన్నాడని.. ఆయన తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అని గుర్తుకు రాదు. పాపం.. తెలుగు దేశం నాయకులు తమ ఇష్టం కొద్దీ తెలుగు దేశం జాతీయ పార్టీ అని చెప్పుకుంటారు కానీ.. అసలు ఆ పార్టీ ప్రస్తుతం ఒక ఉప ప్రాంతీయ పార్టీ కంటే దారుణంగా తయారైంది.

 

 

తెలుగు దేశం ఉనికి ఉన్నదే కేవలం ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణల్లో.. ప్రస్తుతం తెలంగాణలో ఆ పార్టీ తూడుచుపెట్టుకుపోయిందనే చెప్పాలి.. పేరుకు ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచినా ప్రస్తుతం ఒక్క ఎమ్మెల్యేనే ఉన్నారు. ఇటీవల జరిగిన పురపాలక ఎన్నికల్లో ఆ పార్టీ అసలు పోటీయే చేయలేదు. ఇప్పుడు ఏపీలో కూడా కేవలం 23 ఎమ్మెల్యేలే గెలిచారు. అందులోనూ ఓ ముగ్గురు పార్టీకి దూరంగా ఉంటున్నారు.

 

IHG

 

అలాంటి తెలుగుదేశానికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కళా వెంకట్రావు సొంత మండలంలో వైసీపీ దూకుడు చూపిస్తోంది. స్థానిక ఎన్నికల్లో కళా వెంకటరావు సొంత మండలమైన రేగిడిలో మూడు ఎంపీటీసీ స్థానాలను వైఎస్సార్సీపీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. మండల పరిషత్‌ అధ్యక్ష పదవిని సైతం దక్కించుకుంటోంది. మరి రాష్ట్ర అధ్యక్షుడి సొంత మండలంలోనే ఇలా ఉంటే జిల్లాలో మిగతా చోట్ల ఇంకెంత దారుణంగా ఉందో అని నాయకులు లెక్కలు వేసుకుంటున్నారు.

 

 

ఖండ్యాం, కందిశ, కొమ్మెర ఎంపీటీసీ స్థానాలకు ఒక్క వైఎస్సార్‌సీపీ అభ్యర్థులే నామినేషన్లు వేశారు. టీడీపీతో సహా విపక్షాలు నామినేషన్లు వేయకపోవడంతో అవి ఏకగ్రీవమైపోయాయి. ఇటీవల విశాఖను రాజధానిగా చేస్తూ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని టీడీపీ వ్యతిరేకించినందువల్లే ఇంత ఘోరమైన ఫలితాలు వస్తున్నాయంటున్నారు స్థానిక నేతలు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: