స్థానిక ఎన్నికల ముందు వలసలు తెలుగుదేశం పార్టీని ఉక్కిరి , బిక్కిరి చేస్తున్నాయి . ఒకవైపు నెత్తిమీద ఎన్నికలున్న తరుణం లో పార్టీ నుంచి హేమాహేమీలు నిష్క్రమిస్తుండడం టీడీపీ క్యాడర్ ను అయోమయానికి గురి చేస్తోంది . స్థానిక సమరానికి ముందే కరుడుకట్టిన  టీడీపీ నేతలను తమవైపు తిప్పుకోవడం లో అధికార వైస్సార్ కాంగ్రెస్  పార్టీ పూర్తిగా సక్సెస్ అయిందనే చెప్పాలి .  ఎన్నికల ముందు అధికార పార్టీ ఆడుతున్న మైండ్ గేమ్ ను ఎలా ఎదుర్కోవాలో తెలియక టీడీపీ నాయకత్వం దాదాపు చేతులెత్తిసినంత పని చేసింది . టీడీపీ ని  వీడుతారని ఇప్పటికే  ప్రచారం జరుగుతున్న ఏ ఒక్క నాయకున్ని , ఆ  పార్టీ నాయకత్వం నిలువరించే పరిస్థితి  కన్పించడం లేదు .

 

దీనితో అసలు పార్టీలో ఏమి జరుగుతుందన్న గందరగోళం పార్టీ క్యాడర్ లో నెలకొంది . ఎందుకు పార్టీ నేతల వలసలను, నాయకత్వం అడ్డుకోలేకపోతుందన్న ప్రశ్న వారిని వేధిస్తోంది .  అయితే ఇప్పటికే పార్టీ ని వీడిన నేతలు ,టీడీపీ  నాయకత్వాన్ని దారుణంగా టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు . పార్టీ ఫిరాయించిన నేతలు, పక్క పార్టీలో తమ మనుగడ కోసం నాయకత్వం పై విమర్శలు చేయడం సహజమేనని సరిపెట్టుకుందామనుకున్న , పార్టీ వీడుతున్న నేతలు చేస్తోన్న విమర్శలను తిప్పికొట్టే నాయకుడు కూడా  లేకపోవడం  క్యాడర్ ను  ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేదిగా ఉందన్న వాదనలు విన్పిస్తున్నాయి  .

 

ఇప్పటికే  టీడీపీ కి పలువురు కీలక నేతలు గుడ్ బై చెప్పగా , రేపు పార్టీని వీడి ఎవరు వెళ్తారోనన్న ఆందోళనలో ఆ పార్టీ నాయకత్వం లో స్పష్టంగా కన్పిస్తోంది . పార్టీ వీడుతోన్న నేతల సంఖ్య ఒకవైపు పెరుగుతున్న తరుణం లో ,  టీడీపీ నుంచి తమ పార్టీలోకి పది మంది ఎమ్మెల్యేలు చేరనున్నారని   మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్ద బాంబ్ నే పేల్చారు . అదే గనుక జరిగితే  టీడీపీ భవిష్యత్తే ప్రశ్నార్ధకం   కానుంది . 

మరింత సమాచారం తెలుసుకోండి: