తెలుగుదేశం పార్టీ కి గుడ్ బై చెప్పిన తమ్ముడి కే ఈ ప్రభాకర్  నిర్ణయాన్ని పరోక్షంగా మాజీ ఉప ముఖ్యమంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు  కే ఈ కృష్ణమూర్తి సమర్ధించారు . పార్టీ కి రాజీనామా చేసే విషయాన్నీ తనతో సంప్రదించలేదన్న ఆయన , కే ఈ ప్రభాకర్  వైస్సార్ కాంగ్రెస్ పార్టీ చేరితే తనకు అభ్యంతరం లేదని చెప్పారు  . కే ఈ ప్రభాకర్ తనతో టచ్ లో లేడంటూనే, ఇంకా టీడీపీ ని ఎవరెవరూ వీడుతారో తనకు తెలియదని అన్నారు  . టీడీపీ లో  కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి చేరిక ను  కే ఈ సోదరులు తొలుత తీవ్రంగా వ్యతిరేకించారు .

 

అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం మూటగట్టుకున్న తరువాత అటు కోట్ల , ఇటు కే ఈ కుటుంబాలు రాజకీయాలకు అంటి ముట్టనట్లు వ్యవహరిస్తున్నట్లు  కన్పించాయి . అయితే స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యం లో తాను సూచించిన వారికి కార్పొరేటర్ టికెట్లు ఇవ్వలేదన్న కారణంగా టీడీపీ కి గుడ్ బై చెబుతున్నట్లు కే ఈ ప్రభాకర్ ప్రకటించారు . బీజేపీ నేత కనుసన్నల్లో జిల్లా టీడీపీ అధ్యక్షుడు పని చేస్తున్నారని ఆయన ఆరోపించారు . రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ పేరును ప్రసావించకుండా కే ఈ ప్రభాకర్ విమర్శలు చేశారు .  అయితే కర్నూల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయరాదని తాము నిర్ణయించామని కే ఈ కృష్ణమూర్తి  పేర్కొనడం హాట్ టాఫిక్ గా మారింది  .

 

 అయితే కార్పొరేటర్ టికెట్లు తాను సూచించిన వారికి ఇవ్వలేదని పార్టీ మారుతున్నట్లుగా తమ్ముడు చెబుతుండగా , అన్న మాత్రం తాము పోటీ చేయరాదని నిర్ణయించుకున్నామని చెబుతూనే , తమ్ముడి నిర్ణయానికి పరోక్షంగా మద్దతు తెలియజేయడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలో తెలియక కర్నూల్ పట్టణ టీడీపీ క్యాడర్ గందరగోళానికి గురవుతున్నారు .  

మరింత సమాచారం తెలుసుకోండి: