కరోనా వైరస్ కారణంగా ప్రపంచ దేశాలు అన్నీ అల్లాడి పోతున్నాయి. ప్రతి ఒక్కరు ముఖానికి మాస్ కట్టుకునే తిరుగుతున్నారు. అతి ముఖ్యమైన పని ఉంటే తప్ప జనాల్లోకి వెళ్లేందుకు ఇష్టపడడం లేదు. ఇక అనేక కంపెనీలు కూడా వర్క్ టూ హోమ్ అంటూ ఉద్యోగులకు ఆఫీసులకు రాకుండా చేయగలిగింది. షేక్ హ్యాండ్ కూడా ఎవరు ఇచ్చుకోవడం లేదు. కేవలం నమస్కారాలతో సరిపెట్టేస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిని కూడా దూరంగా ఉంచుతున్నారు. వారిని పలకరించే సాహసం కూడా ఎవరూ చేయడం లేదు. ఎందుకంటే అక్కడ కరోనా ఎఫెక్ట్ గురవుతాం అనే ఆందోళనలో ఉన్నారు. ఇదంతా ఇలా ఉండగా సోషల్ మీడియాలో మాత్రం రకరకాలుగా పోస్టింగ్ లు పెడుతూ కరోనా మీద జోకులు  వేసుకుంటున్నారు.కరోనా వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అంటూ సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెడుతున్నారు. అవేంటో మనమూ చదువుదాం.

 

IHG

భ్రష్టు పట్టిన వ్యవస్థలో మార్పు కరోనా తోనే సాధ్యం.

 

అదుపుతప్పిన విచ్చలవిడి సమాజాన్ని గాడిలో పెట్టాలంటే కరోనా రావాలి.

 

కరోనా నో షేక్ హ్యాండ్.. సంస్కారంతో కూడిన నమస్కారం నేర్పింది.

 

నిజమో కాదో తెలియదు చైనీయులు జంతువులు, కీటకాలు తింటున్న వీడియోలు చూసిన మన వాళ్ళు వాంతులు చేసుకుని నాన్ వెజ్ జోలికి వెళ్లడం లేదు.

 

కరోనా సంగతి తెలియదుగాని చేతులు శుభ్రంగా కడుక్కోండి రా అంటే యూనిసెఫ్ చెప్పినా నవ్వి తీసిపారేశాం.

 

ఇప్పుడు చేతులు సబ్బులు అరిగేలా శానిటేషన్ అయిపోయేలా కడగడంతో మిగిలిన రోగాలు ఆమడ దూరాన కి వెళ్ళిపోయాయి.

 

అనవసర తిరుగుళ్లు లేవు. దుబారా ఖర్చులు లేవు.

 

హోలీ రోజున పసుపు కుంకుమ తో సున్నితంగా కానిచ్చాం. అమ్మో లేదంటే గ్రీజు ఆయిలు కోడిగుడ్డు నానా చండాలం అయ్యేది.

 

అల్లం, వెల్లుల్లి, సొంటి, మిరియాల గొప్పతనం తెలిసొచ్చింది.

 

మన చారు చైనా వాళ్ళు తాగుతున్నారు.

 

పురుగుల మందు ఇలాంటి కూల్ డ్రింక్ ల జోలికి ఎవరూ వెళ్లడం లేదు.

 

ఏసీలు మానేయడం తో కరెంట్ బిల్లు కారణంగా జేబుకు చిల్లు పడడం లేదు.

 

రైళ్లల్లో బస్సుల్లో అనవసర ప్రయాణాలు తగ్గిపోవడంతో, అవసరమైన వాళ్లకి సీట్లు దొరుకుతున్నాయి. ఇంటి పట్టునే ఉండడంతో ఇంట్లో వాళ్ళతో మాట్లాడడం పెరిగింది. బంధాలు బలపడుతున్నాయి.

 

తాగే నీళ్ళ నుంచి వేసుకునే బట్టల వరకు జాగ్రత్తలు తీసుకుంటున్నాం.

 

ఏమవుతుందిలే అన్న టెంపర్ తనం కనుమరుగయ్యింది.

 

అందుకే మరక మంచిదే ..కరోనా మంచిది... కరుణ కుచ్ కర కే దిఖాయా!

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: