ప్రస్తుతం ప్రపంచాన్నిఏదైనా వణికిస్తోంది అంటే అది కరోనా వైరస్ ఏ.. నిస్సందేహంగా చెప్పేయచ్చు. అలాంటి కరోనా వైరస్ కారణంగా ఎంతోమంది ఇప్పటికే మరణించారు. చైనాలో పుట్టిన ఈ కరోనా వైరస్ కారణంగా ప్రపంచంలో ఎన్నో మార్పులు సంభవించాయి.. ఇకపోతే ఈ కరోనా వైరస్ ప్రస్తుతం భారత్ ను కూడా వణికించేస్తోంది. ఈ నేపథ్యంలోనే మొన్న ఒక వ్యక్తి కరోనా భారిన పడి మృతి చెందగా నిన్న మరొకరు కరోనా భారిన పడి మృతి చెందారు. 

 

ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. దేశ రాజధాని ఢిల్లీలో రెండో మరణం చోటు చేసుకుంది. కరోనా బారినపడి చికిత్స పొందుతూ ఢిల్లీలో 68 ఏళ్ల ఓ మహిళ శుక్రవారం రాత్రి మృతి చెందింది. పశ్చిమ ఢిల్లీలోని జనక్‌పురికి చెందిన 68 ఏళ్ల మహిళ స్థానిక రామ్‌ మనోహర్‌ లోహియా ఆస్పత్రిలో కరోనాతో మృతి చెందినట్లు ఢిల్లీ వైద్య శాఖ కార్యదర్శి ప్రీతీ సుదాన్‌ ప్రకటించారు. భారత్‌లో ఇది రెండో కరోనా మరణం. 

 

కాగా కర్ణాటక చెందిన ఓ వ్యక్తి కరోనా లక్షణాలతో గురువారం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో మృతి చెందిన విషయం విదితమే. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే ఢిల్లీ మృతురాలి కుమారుడు కూడా కరోనా బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతి చెందిన మహిళ, ఆమె కుమారుడు గత నెలలో సిట్జర్లాండ్‌, ఇటలీలో పర్యటించి తిరిగి భారత్‌కు వచ్చారు అని అధికారులు తెలిపారు. 

 

అయితే వారి ఇద్దరికీ పరీక్షలు నిర్వహించగా కరోనా లక్షణాలు ఉన్నట్లు తేలింది. దీంతో మార్చి 7న ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చేరారు. అయితే భాదిత మహిళకు మధుమేహం.. హైపర్ టెన్షన్ కూడా ఉండటం వల్ల ఆమె ఆరోగ్యం బాగా క్షిణించింది.. వెంటిలేటర్ పై ఉంది చికిత్స అందించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. కాగా దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 81కి చేరడం ఆందోళన కలిగిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: