తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె క‌ల్వ‌కుంట్ల రాజ‌కీయ భ‌విష్య‌త్తు ఏంట‌న్న‌దానిపై ర‌క‌ర‌కాల చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఆమెకు తిరుగులేని క్రేజ్ ఉంది. 2014 ఎన్నిక‌ల్లో నిజామాబాద్ నుంచి గెలిచి ఎంపీ అయ్యాక ఆమె ఓ రేంజ్‌లో చ‌క్రం తిప్పారు. అటు లోక్‌స‌భ‌లోనూ ఎట్రాక్ష‌న్‌గా నిలిచారు. ఎప్పుడైతే 2018 ఎన్నిక‌లు ముందుగా వ‌చ్చాయో అప్ప‌టి నుంచి ఆమె జ‌గిత్యాల ఎమ్మెల్యేగా పోటీ చేసి స్టేట్ కేబినెట్లో మంత్రి అవుతార‌ని అనుకున్నారు. కానీ ఆమె తిరిగి లోక్‌స‌భ‌కు పోటీ చేశారు. గ‌తేడాది ఎన్నిక‌ల్లో అనూహ్యంగా బీజేపీ అభ్య‌ర్థి అర్వింద్ చేతిలో ఓడిపోయారు.



అప్ప‌టి నుంచి ఆమెకు రాజ‌కీయంగా క‌ష్టాలు ప్రారంభ‌మ‌య్యాయి. త‌ర్వాత హుజూర్ న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల్లోనూ ఆమె పేరు ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చింది. ఇక ఇప్పుడు రాజ్య‌స‌భ ఎన్నిక‌లు.. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల వేళ కూడా ఆమె పేరు తెర‌మీద‌కు వ‌చ్చింది. క‌విత‌కు రాజ్య‌స‌భ సీటు గ్యారెంటీ అనుకున్నారు. అయితే కేసీఆర్ అనూహ్యంగా ఆమెను ప‌క్క‌న పెట్టేశారు. అసలు పెద్ద పెద్ద మేథావులన బడేవాళ్లే కేసీఆర్ను ఎదిరించే ద‌మ్ము లేక దగ్గుతూ ఇంట్లోనే ఉండిపోతున్నారు. టీఆర్ఎస్లో వీధిలో కుంపటి పెట్టే కెపాసిటీ ఉన్న ఏకైక మనిషి ఒక్క హరీశ్రావు.ఆయనే గప్చుప్గా ఉన్నారు.



ఇక ఇప్పుడు రాజ్య‌స‌భ‌కు ఎంపికైన కేకేలు. కేఆర్‌ల‌కు రాజ్య‌స‌భ ఇవ్వ‌క‌పోయినా వాళ్లు చేసేదేం లేదు. ఏదో కేసీఆర్‌కు ఇవ్వాలినిపించింది ఇచ్చారు అంతే. ఇక ఇప్పుడు క‌విత భ‌విష్య‌త్తు ఏంట‌న్న‌ది ప్ర‌శ్నించుకుంటే.. ఇప్పడామే ఏం చేయాలి. ఎమ్మెల్సీని చేసి.. మంత్రి వర్గంలోకి తీసుకుంటారా..? తీసుకుంటే కేటీఆర్ వర్సెస్ కవిత అన్నట్టుగా మారే ఛాన్స్ ఉంది. అస‌లు ఏ ప‌ద‌వి ఇవ్వ‌క‌పోతే ఇంట్లో ఖ‌చ్చితంగా కుంప‌టి ర‌గిలే ఛాన్స్ కూడా ఉంది. ఏదేమైనా ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో క‌విత‌ను రాజ్య‌స‌భ‌కు పంపినా కేసీఆర్‌ను అడిగే వాడే లేడు. మ‌రి ఇప్పుడు క‌విత రాజ‌కీయ భ‌విష్య‌త్తు ఎలా ఉంటుంది ?  ఆమె ఏం చేస్తుంద‌న్న‌ది ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: