ప్రస్తుతం ఆన్లైన్ ప్రపంచం నడుస్తున్న విషయం తెలిసిందే. ఏది కావాలన్నా చేతిలో స్మార్ట్ఫోన్ ఉంటే చాలు చెంతకు వచ్చేలా చేసుకోవచ్చు. చివరికి మనం వేసుకునే చెప్పులు నుంచి.. మనం తినే ఆహారం వరకూ ప్రతిదీ ఆన్లైన్ లో దొరుకుతుంది. ఈ మధ్యకాలంలో ఆన్లైన్ లో ఎక్కువగా కూరగాయలు కూడా దొరికిపోతున్నాయి  దీంతో మార్కెట్ కు  వెళ్లాల్సిన అవసరం కూడా లేకపోయింది. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ఇంటి దగ్గర నుంచి అన్ని అవసరాలను తీర్చుకోవచ్చు. అంతలా మారిపోయింది టెక్నాలజీ. ఇక రోజురోజుకూ మారుతున్న టెక్నాలజీకి అటు ప్రజలు కూడా బాగా ప్రభావితులవుతున్నారు. ఒకప్పుడు ఏదైనా కావాలంటే ఎక్కడికో వెళ్లి తీసుకోవాల్సి వచ్చేది కానీ ప్రస్తుతం చేతిలో స్మార్ట్ఫోన్ ఉంటే చాలు రారాజుల ఫీలవుతున్నారు. ఏది కావాలన్నా ఆర్డర్  చేసి తమ ఇంటి ముంగిటకే తెచ్చుకుంటున్నారు. 

 

 

 టెక్నాలజీ పెరగడం ఏమో కానీ టెక్నాలజీ కంటే ఎక్కువగా ఆన్లైన్ మోసాలు కూడా పెరిగిపోతూ వస్తున్నాయి. దీంతో ఆన్లైన్ లో ఏదైనా ఆర్డర్ చేయాలి అన్నా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కొన్ని కొన్ని వస్తువులను మాత్రమే ఆన్లైన్లో కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే కొన్ని కొన్ని బయట దుకాణాలలో దొరికే ధరల కంటే ఆన్లైన్లో చాలా తక్కువ ధరకు దొరుకుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అందుకే ఎక్కువ మొత్తంలో జనాలు ఆన్లైన్ ద్వారా షాపింగ్ చేయడానికి ఎక్కువ మొగ్గు చూపుతుంటారు. అలాగే అనుకుని ఇక్కడ ఒక వ్యక్తి ఆన్లైన్ లో ఒక బుక్కు కొనుగోలు చేశాడు. కానీ ఆర్డర్  తీరా ఇంటికి వచ్చాక చూసి మాత్రం అవాక్కయ్యాడు. 

 

 

 ఇంతకీ ఏం జరిగింది అంటారా... హైదరాబాద్ కు  చెందిన కాజా హమీద్  అనే వ్యక్తి అమెజాన్ లో ఒక పుస్తకాన్ని కొనుగోలు చేశాడు. ఏకంగా 2715 రూపాయలకు ఆ పుస్తకాన్ని కొనుగోలు చేశాడు. ఇక ఆ పుస్తకం డెలివరీ అయిన తర్వాత చూస్తే మాత్రం ఆ పుస్తకం ఖరీదు కేవలం 400 రూపాయలు మాత్రమే ఉంది. దీంతో ఆ వ్యక్తి వినియోగదారుల ఫోరం కు ఫిర్యాదు చేశాడు. ఇక ఆన్లైన్లో పుస్తకాన్ని ఎక్కువ రేటుకు అమ్మిన అందుకుగానూ అమెజాన్ కు  హైదరాబాద్ జిల్లా వినియోగదారుల ఫోరం పదివేల రూపాయలు జరిమానా విధించింది. ఆ బుక్కు ని కొనుగోలు చేసిన వినియోగదారుల నుంచి అధికంగా వసూలు చేసిన 2315 రూపాయలతో పాటు పది వేల రూపాయల అదనపు పరిహారం చెల్లించాలని ఆదేశించింది జిల్లా వినియోగదారుల ఫోరం.

మరింత సమాచారం తెలుసుకోండి: